
పెట్రోల్‌కు బదులు వర్షం నీరు
తుని రూరల్: తుని మండలం తేటగుంట శివారు ఎర్రకోనేరు వద్ద ఓ పెట్రోల్ బంకులో యాజమాన్యం నిర్వాకంతో పెట్రోల్‌కు బదులుగా మోటార్ సైకిళ్లకు వర్షపు నీరు పోశారు. ఆదివారం ఉదయం పెట్రోల్ కోసం పలువురు వాహనదారులు వెళ్లారు. పెట్రోల్ నింపినా వాహనాలు స్టార్ట్ కాకపోవడంతో వినియోగదారులు అవాక్కయ్యారు. చివరికి బంకులో నింపిన పెట్రోల్‌ను బయటకు తీసి చూడగా ఎర్రగా నీరు వచ్చింది. ఆందోళన వ్యక్తం చేసి వాహనదారులు బంకు యాజమాన్యాన్ని నిలదీశారు. దీంతో డబ్బు తిరిగి ఇచ్చేస్తామనడంతో వాహనదారులు శాంతించారు. బంకులో పెట్రోల్ ట్యాంకు పైపులైన్‌కు మరమ్మతులు చేస్తుండడం, శనివారం రాత్రి భారీ వర్షం కురవడంతో వర్షపునీరు చేరి ఈ పరిస్థితి నెలకొన్నట్టు యాజమాన్యం సర్థి చెప్పింది. ఆరేళ్ల కిందట ఇదే పరిస్థితి తలెత్తడంతో ఈ విషయం జిల్లా అధికారులకు వెళ్లడంతో తనిఖీలు చేశారు. ఈ మేరకు జరిమానాలు విధించారు. ఇప్పుడు డబ్బులు తిరిగి చెల్లించడంతో వాహనదారులు అధికారులకు ఫిర్యాదు చేయకపోవడంతో సమస్య సద్దుమణిగింది.

పెట్రోల్‌కు బదులు వర్షం నీరు