
ఆర్‌ఎంసీ వెబ్‌సైట్‌లో అభ్యర్థుల జాబితా
కాకినాడ క్రైం: కాకినాడ రంగరాయ వైద్య కళాశాలలో పారా మెడికల్ కోర్సుల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ప్రొవిజినల్ జాబితాను http: //rmckakinada.com వెబ్‌సైట్‌లో వారి పరిశీలనార్థం విడుదల చేసినట్టు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ.విష్ణువర్దన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ జాబితాలో అభ్యంతరాలున్న వారితో పాటు, గతంలో సంబంధిత ధ్రువపత్రాలు సమర్పించని వారు ఈ నెల 8వ తేదీ సాయంత్రం 4 గంటల్లోగా ఆర్‌ఎంసీ కార్యాలయంలో అందించాలని సూచించారు. వివరాలకు వెబ్‌సైట్‌ను సందర్శించాలని తెలిపారు.
కాకినాడ జిల్లా ఇన్‌చార్జి
రిజిస్ట్రార్‌గా సత్యనారాయణ
కాకినాడ లీగల్: స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ కాకినాడ జిల్లా ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌గా రాజమహేంద్రవరం జిల్లా రిజిస్ట్రార్ రెడ్డి సత్యనారాయణను నియమిస్తూ రాష్ట్ర స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ ఏడాది మార్చి 28న కాకినాడ జిల్లా రిజిస్ట్రార్‌గా పనిచేసున్న కె.ఆనందరావును అవినీతి కేసులో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు పట్టుకున్నారు. అనంతరం ఆనందరావు స్థానంలో ఉమ్మడి జిల్లా మార్కెట్ అండ్ ఆడిట్ జిల్లా రిజిస్ట్రార్ జేఎస్‌యూ జయలక్ష్మిని కాకినాడ జిల్లా ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌గా నియమించారు. ఆమె వ్యక్తిగత కారణాలతో సోమవారం నుంచి ఈ నెల 20వ తేదీ వరకు సెలవు పెట్టారు. ఆమె స్థానంలో రాజమహేంద్రవరం జిల్లా రిజిస్ట్రార్ రెడ్డి సత్యనారాయణను నియమిస్తూ ఐజీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి.