
జో లాలీ.. నిద్ర వీడాలి
అలసిన ప్రయాణానికి ఆటో పడకగా మారింది.. చేరాల్సిన గమ్యం ప్రమాదపుటంచున సాగింది.. అసలే పరిమితికి మించిన ప్రయాణం.. ఆపై ప్రయాణికుల పవళింపు.. ఇది ఉప్పలగుప్తంలో కనిపించిన దృశ్యం. ఒక డ్రైవర్ ఆటోలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం ఓ తప్పయితే, వెనుక భాగంలో డోర్‌ను తీసి ప్రయాణికులను కూర్చోపెట్టాడు. అంత కంటే నిర్లక్ష్యంగా ముగ్గురు మహిళలు అక్కడ కూర్చోగా, ఇద్దరు నిద్రిస్తూ వెళ్లారు. ఇంత నిర్లక్ష్యపు ప్రయాణాలతో ప్రమాదాలు జరుగుతున్నా, కాస్తయినా ఆలోచన ఉండడం లేదని ప్రజలు పెదవి విరిచారు. వాహనాలకు చిన్న కారణాలతో చలానాలు విధించే రవాణా శాఖకు ఇవి కనిపించడం లేదా అని విమర్శించారు.
–ఉప్పలగుప్తం