
రేషన్ బియ్యం స్వాధీనం
పెదపూడి: జి.మామిడాడలో ఒక ఇంట్లో నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నామని తహసీల్దార్ పీవీ సీతాపతిరావు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. అధికారులకు అందిన ముందస్తు సమాచారం మేరకు ఆదివారం జి.మామిడాడ గజం కాలువ సమీపంలో ఓ ఇంటిపై తహసీల్దార్‌తో పాటు వీఆర్వోలు దాడి చేశారు. అక్కడ అక్రమంగా నిల్వ ఉంచిన 14.57 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుకున్నారు. పోలీసులు, ఎంఎస్‌ఓ కమల, వీఆర్వోలు వివరాలు సేకరించారు. ఆ బియ్యాన్ని వేళంగిలోని ఎంఎల్‌ఎస్ పాయింట్‌కు తరలించారు. అక్రమంగా బియ్యం నిల్వ ఉంచిన వేండ్ర గ్రామానికి చెందిన నర్ల సత్తిబాబుపై 6ఏ కేసు నమోదు చేశారు. కార్యక్రమంలో వీఆర్వోలు కె.శ్రీను, ఎల్.రాంబాబు, సిబ్బంది తదితరులు ఉన్నారు.