
ఉల్లాసంగా ఎస్‌జీఎఫ్‌ఐ ఎంపికలు
ఉమ్మడి జిల్లా పరిధిలో 600 మంది హాజరు
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య అండర్–14, 17 ఆధ్వర్యంలో శనివారం కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో రాష్ట్ర స్థాయి పోటీలకు వివిధ క్రీడాంశాల్లో జిల్లా జట్ల ఎంపికలను నిర్వహించారు. ఈ ఎంపికలను సీనియర్ పీడీలు రవిరాజు, బంగార్రాజు, పట్టాభిరామం, మాజీ ఎస్‌జీఎఫ్‌ఐ కార్యదర్శి జార్జి, ఎస్‌జీఎఫ్‌ఐ కార్యదర్శులు కె.శ్రీనివాస్, సుధారాణి ప్రారంభించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిఽధిలో సుమారు 600 మంది క్రీడాకారులు హాజరయ్యారు. సైక్లింగ్, తైక్వాండో, రెజ్లింగ్, స్క్వాష్, పెంటాథలాన్‌లో జరిగిన ఎంపికలకు తైక్వాండో సంఘ కార్యదర్శి బి.అర్జునరావు, డీఎస్‌ఏ రెజ్లింగ్ కోచ్ కనకదుర్గ, డీఎస్‌ఏ స్క్వాష్ కోచ్ లక్ష్మణ్ సాంకేతిక అధికారులుగా వ్యవహరించారు. కాకినాడ రాజా ట్యాంక్ ఆవరణలోని వైఎస్సార్ మున్సిపల్ స్కేటింగ్ రింక్‌లో స్కేటింగ్ ఎంపికలను ఎస్‌జీఎఫ్‌ఐ కార్యదర్శి సుధారాణి ప్రారంభించారు.

ఉల్లాసంగా ఎస్‌జీఎఫ్‌ఐ ఎంపికలు