
శాంతించిన గోదారమ్మ
దవళేశ్వరం: ఉగ్రరూపం దాల్చిన గోదారమ్మ ఎట్టకేలకు శాంతించింది. కాటన్ బ్యారేజీ వద్ద నీటిమట్టం శుక్రవారం తెల్లవారుజామున 11.70 అడుగులకు తగ్గడంతో మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. అనంతరం నీటిమట్టం మరింతగా తగ్గుతూ 10.10 అడుగులకు చేరింది. బ్యారేజీ నుంచి 7,48,015 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడిచిపెట్టారు. ఎగువ ప్రాంతాల్లో కూడా నీటిమట్టాలు తగ్గడంతో కాటన్ బ్యారేజీ వద్ద వరద ఉధృతి శనివారం మరింత తగ్గే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు.
ఎగువ ప్రాంతాల్లో గోదావరి నీటిమట్టాలు (మీటర్లలో..)
కాళేశ్వరం 10.27
పేరూరు 14.17
దుమ్ముగూడెం 10.25
భద్రాచలం 36.80 (అడుగులు)
కూనవరం 16.42
కుంట 7.88
పోలవరం 11.16
రాజమహేంద్రవరం రైల్వే బ్రిడ్జి 15.49