
అత్యవసర సమయం.. నాటు పడవే ఆధారం
రాజానగరం (సీతానగరం): గోదావరి వరదల సమయంలో సీతానగరం మండలం ములకల్లంక వాసులు పడే అవస్థలు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా ఆ సమయంలో గ్రామంలో ఎవరికై నా ఆరోగ్యం బాగోకపోతే ఆస్పత్రికి వెళ్లేందుకు ఇబ్బంది పడక తప్పదు. శుక్రవారం ఉదయం అదే జరిగింది. ఆ గ్రామానికి చెందిన ఎం.అనసూయ (85) తీవ్ర అస్వస్థతకు గురవడంతో కుటుంబ సభ్యులు 108కు ఫోన్ చేశారు. వెంటనే వచ్చిన సిబ్బంది వరద ఉధృతి కారణంగా ఆమె ఉన్న ములకల్లంక వెళ్లలేకపోయారు. చివరకు అనసూయను కుటుంబ సభ్యుల సహకారంతో ఆ గ్రామం నుంచి బయటకు తీసుకువచ్చి, తమ వాహనంలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో వైద్య సేవలు పొందుతున్నారు.