
● సరస్వతీ నమోస్తుతే..
● వాగ్దేవీ.. వరదాయినీ..
దసరా ఉత్సవాల్లో భాగంగా సోమవారం
జిల్లావ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో అమ్మవారిని సరస్వతీ దేవిగా అలంకరించారు. రెండు చేతుల్లో జపమాల, పుస్తకం, మరో రెండు చేతులతో వీణ ధరించిన అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. అజ్ఞానాంధకారాన్ని పారదోలి జ్ఞానాన్ని ప్రసాదించే వరదాయిని జగజ్జనని. ఆ అమ్మవారి జన్మనక్షత్రం మూల కావడంతో పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు తమ పిల్లలతో పుస్తకాల పూజలు, అక్షరాభ్యాసాలు చేయించి, ఆ తల్లి దీవెనలు పొందారు.
– సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం)
నిడదవోలు రూరల్: తిమ్మరాజుపాలెం గ్రామంలో వేంచేసియున్న శ్రీ కోటసత్తెమ్మ అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్ర ఉత్సవాల సందర్భంగా సోమవారం 507 మంది దంపతులు సహస్రనామ కుంకుమ పూజలు, చండీ పారాయణ, హోమాలు నిర్వహించారు. మూల నక్షత్రాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఉచిత సామూహిక సరస్వతీ పూజల్లో సుమారు 1,200 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వారికి దాతల సహకారంతో పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. అమ్మవారికి వివిధ రూపాల్లో రూ.2,34,412 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈఓ, అసిస్టెంట్ కమిషనర్ వి.హరి సూర్య ప్రకాష్, తెలిపారు.
ప్రత్యేక అలంకరణలో కోటసత్తెమ్మ తల్లి

● సరస్వతీ నమోస్తుతే..

● సరస్వతీ నమోస్తుతే..

● సరస్వతీ నమోస్తుతే..

● సరస్వతీ నమోస్తుతే..