
● లలితా.. లోకమాతా...
దసరా మహోత్సవాల్లో ఏడో రోజైన ఆదివారం రాజమహేంద్రవరం దేవీచౌక్‌లోని మండపంలో అమ్మవారు శ్రీ లలితా త్రిపురసుందరీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. దేవీ ఉపాసకులకు లలితా పరాభట్టారిక అమ్మవారు ముఖ్య దేవత. పంచదశాక్షరి మహామంత్ర అధిష్టాన దేవతగా లలితాత్రిపుర సుందరీదేవిని ఆరాధిస్తారు. సకల లోకాతీతమైన కోమలత్వం కలిగిన మాతృమూర్తిగా.. చెరుకు గడ, విల్లు, పాశాంకుశాలను ధరించి.. కుడివైపు లక్ష్మీదేవి, ఎడమవైపు సరస్వతీదేవి సేవలు చేస్తూండగా లలితాదేవి భక్తులకు దర్శనమిస్తుంది. దారిద్య్ర దుఃఖాలను తొలగించి సకల ఐశ్వార్యాభీష్టాలను సిద్ధింపజేస్తుందని భక్తులు విశ్వసిస్తారు. లలితా త్రిపురసుందరీదేవి రూపంలో అమ్మవారికి 108 మంది దంపతులతో ప్రత్యేకంగా కుంకుమ పూజ నిర్వహించారు. తెల్లవారు జూము నుంచే దంపతులు భక్తిశ్రద్ధలతో ఈ పూజలు చేశారు. అనంతరం అమ్మవారి ప్రసాదంగా పసుపు కుంకుమలు అందజేశారు. గోదావరి గట్టున శ్రీ ఉమా మార్కండేయేశ్వర స్వామి ఆలయంలో స్వయంభువుగా వెలసిన పార్వతీ మాతను శ్రీమహాచండీ దేవిగా అలంకరించారు.
– సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం)

● లలితా.. లోకమాతా...