
● జగజ్జననీ.. దివ్య స్వరూపిణీ..
నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెంలో కోటసత్తెమ్మ అమ్మవారిని ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్నారు. దేవీ శరన్నవరాత్ర ఉత్సవాలను పురస్కరించుకుని అమ్మవారికి 417 మంది దంపతులు సహస్రనామ కుంకుమ పూజలతో పాటు చండీ పారాయణ, హోమాలు నిర్వహించారు. అమ్మవారికి వివిధ రూపాల్లో రూ.2,59,768 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈఓ, అసిస్టెంట్ కమిషనర్ వి.హరి సూర్య ప్రకాష్ తెలిపారు. ఆలయ ప్రాంగణంలో చిన్నారుల కోలాటం భక్తులను ఆలరించింది. కార్యక్రమాల్లో ఆలయ ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్, చైర్మన్ దేవులపల్లి రవిశంకర్ పాల్గొన్నారు.
– నిడదవోలు రూరల్

● జగజ్జననీ.. దివ్య స్వరూపిణీ..