
లక్షణంగా.. లక్ష్మీ కళ ఉట్టిపడేలా..
రాజమహేంద్రవరం రూరల్ బొమ్మూరు – రాజవోలు రోడ్డులోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో అమ్మవారు శ్రీమహాలక్ష్మీదేవిగా శనివారం భక్తులకు దర్శనమిచ్చారు. శరన్నవరాత్ర వేడుకల్లో భాగంగా అమ్మవారిని రూ.10 లక్షల కరెన్సీ నోట్లతో అలంకరించారు. కుడిపూడి శ్రీనివాస్, లక్ష్మి దంపతుల ఆధ్వర్యాన రూ.500, రూ 200, రూ.100, రూ.20 కరెన్సీ నోట్లతో అలంకరించారు.
– రాజమహేంద్రవరం రూరల్
దేవీ నవరాత్రులను పురస్కరించుకుని రాజమహేంద్రవరం రాజేంద్ర నగర్‌లో అమ్మవారిని సుమారు రూ.35 లక్షల కరెన్సీ నోట్లతో అలంకరించారు. అమ్మవారితో పాటు ఆలయం లోపలి భాగాన్ని సైతం కరెన్సీ నోట్లతో అలంకరించడంతో ఆ ప్రాంగణం ‘లక్ష్మీ’ శోభను అద్దుకుంది. శ్రీ కనకదుర్గ భవానీ దీక్షా పీఠం ఆధ్వర్యాన గురు భవాని నీలాద్రి వెంకటరమణ, భక్తుల సహకారంతో ఈ అలంకరణ చేశారు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, రాజమహేంద్రవరం

లక్షణంగా.. లక్ష్మీ కళ ఉట్టిపడేలా..