
అసెంబ్లీలో సంస్కార హీనంగా మాట్లాడతారా?
● బాలకృష్ణ వెంటనే క్షమాపణ చెప్పాలి
● మాజీ ఎమ్మెల్యే
తలారి వెంకట్రావు డిమాండ్
● చాగల్లులో అంబేడ్కర్ విగ్రహానికి వినతి
చాగల్లు: హిందుపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అసెంబ్లీలో మెగాస్టార్ చిరంజీవి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పట్ల సంస్కారహీనంగా మాట్లాడటం చాలా నీచమని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ కొవ్వూరు నియోజకవర్గ ఇన్‌చార్జి తలారి వెంకట్రావు మండిపడ్డారు. బాలకృష్ణ వ్యాఖ్యలను నిరసిస్తూ చాగల్లు ఎస్సీ కాలనీలో రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు శుక్రవారం నిరసన తెలిపారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి తలారి వెంకట్రావు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కాల్పుల ఘటనలో నాటి ముఖ్యమంత్రి వైఎస్సార్ చేసిన మేలును బాలకృష్ణ మరచి, ఇటువంటి దారుణమైన వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. బాలకృష్ణ సినిమాలకు రేట్లు పెంచాలని ఆదేశాలిచ్చింది అప్పటి సీఎం వైఎస్ జగన్ అని గుర్తు చేశారు. బాలకృష్ణకు చెందిన బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్‌కు 2014–19 మధ్య అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు బకాయిలు పెడితే, తరువాత అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ ఆ బకాయిలు చెల్లించాలంటూ ఆదేశించారని చెప్పారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో చిరంజీవి ఆధ్వర్యాన తనను కలసిన సినీ బృందాన్ని వైఎస్ జగన్ ఎంతో ఆప్యాయంగా గౌరవించారని చెప్పారు. బాలకృష్ణ విశ్వాసం లేని వ్యక్తి అని, మెంటల్ సర్టిఫికెట్ ఉన్న వాళ్లకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వకూడదని తలారి అన్నారు. గొప్ప మనసున్న నాయకుడు జగన్‌ను సైకో అనడానికి బాలకృష్ణకు నోరెలా వచ్చిందో అర్థం కావడం లేదని అన్నారు. చేసిన తప్పుడు వ్యాఖ్యలకు బాలకృష్ణ వెంటనే క్షమాపణలు చెప్పాలని, లేకుంటే భవిష్యత్తులో ప్రజలు ఆయనను చీదరించుకునే పరిస్థితులు వస్తాయని చెప్పారు. మాజీ సీఎం జగన్ గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని, మరోసారి సంస్కారం లేకుండా మాట్లాడితే బాలకృష్ణకు తగిన బుద్ధి చెబుతామని తలారి హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కమిటీ నాయకులు సుంకర సత్యనారాయణ, ముప్పిడి మహాలక్ష్ము డు, మాజీ సర్పంచ్ గండ్రోతు సురేంద్ర కుమార్, పార్టీ జిల్లా కార్యదర్శి జుట్టా కొండలరావు, పార్టీ మండల అధ్యక్షుడు మట్టా వెంకట్రావు, జిల్లా ప్రచార కమిటీ మాజీ అధ్యక్షుడు తోట రామకృష్ణ, ఆర్‌టీఐ జిల్లా విభాగం అధ్యక్షుడు ఇంటి వీర్రాజు, నాయకులు ఉండవల్లి శ్రీనివాస్, చెల్లింకుల దుర్గామల్లేశ్వరరావు, ఉప్పులూరి సూరిబాబు, కుదప రాంబాబు, చౌటుపల్లి వీరన్న, బొర్రా రజనీప్రసాద్, ఎస్‌కే పాషా, పిల్లి తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు.