
ఆమె స్థానం గురుతరం
● డీఎస్సీ–2025లో వారిదే హవా
● 51.6 శాతం పోస్టులకు ఎంపిక
రాయవరం: పరీక్షలు ఏవైనా ఫలితాల్లో చాలా వరకు బాలికలే ప్రతిభ కనబరచడం చూస్తుంటాం. ఇటీవల నిర్వహించిన డీఎస్సీ–2025లో కూడా మహిళలు సత్తా చాటారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 51.6 శాతం మంది ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికయ్యారు. మొత్తం 1,352 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయగా, 1,349 మంది ఫైనల్ సెలక్షన్ జాబితాలో ఉన్నారు. నాలుగు పోస్టులకు వివిధ కారణాలతో అభ్యర్థులు లేక పోవడంతో అవి భర్తీ కాలేదు. ఫైనల్ సెలక్షన్ జాబితాకు ఎంపికై న 1,349 పోస్టుల్లో వారిదే అగ్రస్థానంగా ఉంది. స్కూల్ అసిస్టెంట్, ఎస్‌జీటీ, టీజీటీ, పీజీటీ తదితర పోస్టులకు పురుషులు, మహిళా అభ్యర్థులు పోటీ పడ్డారు. తుది జాబితాకు ఎంపికై న ఉపాధ్యాయ అభ్యర్థుల్లో 653 (48.4శాతం) మంది పురుష ఉపాధ్యాయ అభ్యర్థులు ఉండగా, 696 (51.6శాతం) మంది మహిళా ఉపాధ్యాయ అభ్యర్థులు ఉన్నారు. గణితం, పీఎస్, సోషల్ స్టడీస్, ఇంగ్లిషు వంటి సబ్జెక్టులు, ఫిజికల్ ఎడ్యుకేషన్ మినహా మిగిలిన సబ్జెక్టులు, ఎస్‌జీటీ పోస్టుల్లో మహిళా ఉపాధ్యాయులే అధిక సంఖ్యలో ఎంపిక కావడం గమనార్హం.
ప్రభుత్వ/జెడ్పీ, మున్సిపల్, మున్సిపల్ కార్పొరేషన్, ట్రైబల్ వెల్ఫేర్ వంటి యాజమాన్యాలకు చెందిన ఉపాధ్యాయ పోస్టుల్లో మహిళలదే హవా కన్పించింది.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో స్కూల్ అసిస్టెంట్లు, ఎస్‌జీటీ పోస్టులకు ఎంపికై న వారి వివరాలు ఇలా
సబ్జెక్టు మేల్ ఫిమేల్ మొత్తం
ఎస్‌ఏ తెలుగు 23 35 58
ఎస్‌ఏ ఇంగ్లీషు 50 45 95
ఎస్‌ఏ హిందీ 12 66 78
సంస్కృతం 03 02 05
ఎస్‌ఏ బయాలజీ 45 62 107
ఎస్‌ఏ ఫిజికల్ సైన్స్ 55 19 74
ఎస్‌ఏ గణితం 44 20 64
ఎస్‌ఏ సోషల్ స్టడీస్ 84 48 132
ఎస్‌ఏ (పీఈ) 142 69 211
ఎస్‌జీటీ (మైదానం) 167 254 421
ఎస్‌జీటీ (ఏజెన్సీ) 28 76 104
మొత్తం 653 696 1,349