
వాడపల్లి వెంకన్నకు రూ.2.4 లక్షల విరాళాలు
కొత్తపేట: కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి శ్రీ, భూ సమేత వేంకటేశ్వరస్వామి వారి క్షేత్రంలో వకుళమాత అన్నప్రసాద భవన నిర్మాణానికి భక్తులు విరివిగా విరాళాలు సమర్పిస్తున్నారు. దానిలో భాగంగా విశాఖపట్నం జిల్లా చిన్న ముషిడివాడకు చెందిన సిరికి అప్పాజీరావు, శ్రీదేవి దంపతులు, వారి కుటుంబ సభ్యులు రూ 2,00,116, మండపేటకు చెందిన ఉంగరాల సీతరాంప్రసాద్, పద్మావతి దంపతులు, వారి కుటుంబ సభ్యులు రూ.40,116 విరాళంగా సమర్పించారు. వారు ముందుగా స్వామి వారిని దర్శించుకున్నారు. దాతలకు దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు స్వామివారి చిత్రపటాన్ని అందచేశారు.
క్యాష్ కౌంటింగ్ మెషీన్ సమర్పణ
వేంకటేశ్వరస్వామి వారి ఆలయానికి భక్తులు సమర్పించే నగదు లెక్కింపు నిమిత్తం రావులపాలెం మండలం లక్ష్మీపోలవరంలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు తరఫున క్యాష్ కౌంటింగ్ మెషీన్‌ను బహూకరించారు. ఆ మేరకు గురువారం ఎమ్మెల్యే బండారు సత్యానందరావు దానిని బ్యాంకు ఆర్‌ఎం జీ శ్రీనివాసరావు డీసీ అండ్ ఈఓ చక్రధరరావుకు అందచేశారు. కార్యక్రమంలో బ్యాంకు ప్లానింగ్ హెడ్ ఎంకేఎస్ శంకర్, బీఎం డి.రాజేష్, సిబ్బంది డి.సూర్యగోపాల్, హేమలత తదితరులు పాల్గొన్నారు.