
నేడు ఆర్డీవో కార్యాలయంలో బార్లకు లాటరీ
రాజమహేంద్రవరం రూరల్: రాజమహేంద్రవరంలోని ఆర్డీవో కార్యాలయంలో గురువారం ఉదయం 8 గంటలకు రెండో విడత బార్లకు లాటరీ తీయనున్నట్లు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి చింతాడ లావణ్య తెలిపారు. జిల్లాలో మిగిలిన 16 బార్లకు గాను బుధవారం రాత్రి 9 గంటల వరకు 32 దరఖాస్తులు మాత్రమే రావడం జరిగిందన్నారు. నాలుగు దరఖాస్తులు వచ్చిన బార్లకు మాత్రమే లాటరీ తీయడం జరుగుతుందన్నారు. ఇప్పటివరకు 8 బార్లకు మాత్రమే నాలుగు దరఖాస్తులు చొప్పున వచ్చాయన్నారు. అర్ధరాత్రి 11.59 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామదని ఆమె తెలిపారు. మొదటి విడతలో ఆరు ఓపెన్ కేటగిరీలో, రిజర్వ్ కేటగిరిలో మూడు బార్లకు లాటరీ తీసిన విషయం తెలిసిందే.