
పని ఒత్తిడి తగ్గించాలంటూ నోటీసుల అందజేత
సీటీఆర్‌ఐ(రాజమహేంద్రవరం): గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పని ఒత్తిడిని తగ్గించాలని, గతంలో వలంటీర్లు చేసిన విధుల నుంచి తమని తప్పించాలని డిమాండ్లతో సచివాలయ ఉద్యోగులు అక్టోబర్ ఒకటో తేదీ నుంచి సమ్మె బాట పట్టనున్నారు. ఈ కార్యాచరణ కోసం బుధవారం సచివాలయ ఉద్యోగులు కలెక్టరేట్‌లో కలెక్టర్ కీర్తి చేకూరిని కలసి తమ కార్యాచరణ ముందస్తు నోటీసును అందజేశారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్యవేదిక పిలుపు మేరకు తూర్పుగోదావరి జిల్లా ఐక్యవేదిక తరఫున జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరికి అందజేశామని ఉభయగోదావరి జిల్లాల గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఫెడరేషన్ కోఆర్డినేటర్ దడాల జగ్గారావు అన్నారు. కార్యక్రమంలో కొల్లి రాజేష్, కాశీ విశ్వనాథ్, నాయుడు, రామాంజనేయులు, రామదాసు సచివాలయ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
బాధ్యతలు స్వీకరించిన
రామచంద్రరావు
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): ఏలూరు జిల్లా పౌర సంబంధాల అధికారిగా పని చేస్తున్న ఆర్‌వీఎస్ రామచంద్రరావు పదోన్నతిపై బుధవారం రాజమహేంద్రవరం రాష్ట్ర సమాచార కేంద్రం సహాయ సంచాలకుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహించిన ఎం.లక్ష్మణాచార్యులు నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి కె.లక్ష్మీనారాయణ అభినందనలు తెలియజేశారు. కార్యాలయ సిబ్బంది వర్మ, ఆనంద్, పలువురు కార్యాలయ సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు.
ఎన్‌డీపీఎస్ కేసులపై
అవగాహన అవసరం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): DVýSÌŒæ òÜ…sŒæ B‹œ GMŠSÞ-Ìñæ-¯ŒSÞÌZ ¿êVýS…V> hÌêÏÌZ° A°² ´ùÎ-‹Ü-õÜtçÙ¯]lÏ ´ùÎçÜ$Ë$, OÆð‡rÆý‡$Ï, AíÜòÜt…sŒæ OÆð‡rÆý‡$Ï, MýS…ç³NÅrÆŠ‡ Bç³-Æó‡r-Æý‡ÏMýS$Ï G¯ŒSyîl-ï³-G‹Ü MóSçÜ$ÌS ç³NÇ¢ C¯ðlÓ-íÜtVóSçÙ¯ŒS {´÷ïÜ-f-ÆŠ‡Oò³ hÌêÏ ´ùÎ‹Ü M>Æ>Å-ÌS-Ķæ$…ÌZ º$«§ýl-ÐéÆý‡… AÐ]l-V>-çßæ¯]l M>Æý‡Å-{MýSÐ]l$… °Æý‡Óíßæ…^éÆý‡$. MóSçÜ$ÌZÏ çÜÐ]l*-^éÆý‡… Ð]l_a-¯]lç³µsìæ ¯]l$…_ ^éÆŠ‡jï-ÙsŒæ §éQË$ ^ólõÜ…™èl Ð]lÆý‡MýS$ çÜÐ]l*-^éÆý‡… H Ñ«§ýl…V> ÇM>Æý‡$z ^ólĶæ*-Í, {´ëç³È-t° H Ñ«§ýl…V> ïÜgŒæ ^ólĶæ*-Í, GÌê ïÜÌŒæ ^ólĶæ*-Í, Ðól$h-[õÜtsŒæ Ð]l§ýlª C¯ðlÓ…-rȰ çÜÇ-tOòœ ^ólƇ$$…^ól Ñ«§é¯]l… Ð]l…sìæ ç³Ë$ A…Ô>ÌSOò³ ç³NÇ¢ AÐ]lV>-çßæ¯]l MýSÍ-µ…-^éÆý‡$. M>Æý‡Å{MýS-Ð]l$…ÌZ Ayìl-çÙ-¯]lÌŒæ GïܵË$ G…½-G¯ŒS Ð]l¬Æý‡-ä-MýS–çÙ~, HÒ çÜ$º¾-Æ>-k, Ķæ$ÌŒæ.-A-Æý‡$j-¯Œl, G‹Ü½ yîlGïܵ ¼.Æ>-Ð]l$MýS–çÙ~, C™èlÆý‡ A«¨M>-Æý‡$Ë$, DVýSÌŒæ íܺ¾…¨ ´ëÌŸY¯é²Æý‡$.˘
రత్నగిరిపై ఏకాదశి పూజలు
అన్నవరం: రత్నగిరి వీర వేంకట సత్యనారాయణ స్వామివారికి భాద్రపద బహుళ ఏకాదశి పర్వదినం సందర్భంగా బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం ఏడు గంటలకు స్వామి, అమ్మవార్లకు స్వర్ణపుష్పాలతో అర్చన చేశారు. అనంతరం ఉదయం తొమ్మిది గంటల నుంచి 11 గంటల వరకు పుష్పార్చన, అనంతరం స్వామి, అమ్మవార్లకు ప్రసాదాలు నివేదించి నీరాజన మంత్రపుష్పాలు సమర్పించారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఇంద్రగంటి నర్శింహమూర్తి, అర్చకులు వేంకటేశ్వర్లు, పరిచారకులు యడవిల్లి ప్రసాద్, కొండవీటి రాజా తదితరులు ఈ పూజలు నిర్వహించారు. సుమారు 20 వేల మంది భక్తులు స్వామివారి సన్నిధికి రావడంతో క్యూలైన్లు, వ్రత మండపాలు, ఆలయ ప్రాంగణం భక్తులతో నిండిపోయాయి. సత్యదేవుని దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట సమయం పట్టింది. సత్యదేవుని దర్శించిన భక్తులు సప్తగోకులంలో శ్రీకృష్ణుడు, గోవులకు ప్రదక్షిణ చేశారు. స్వామివారి వ్రతాలు 1,200 నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.20 లక్షలు ఆదాయం సమకూరింది. ఐదు వేల మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారు.

పని ఒత్తిడి తగ్గించాలంటూ నోటీసుల అందజేత

పని ఒత్తిడి తగ్గించాలంటూ నోటీసుల అందజేత