
రాష్ట్ర స్థాయి పోటీలకు పలువురి ఎంపిక
అమలాపురం రూరల్: ప్రభుత్వం ఇటీవల కాకినాడలో నిర్వహించిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పోటీల్లో అమలాపురం ఎస్‌కేబీఆర్ కళాశాలలో జూనియర్ ఇంటర్మీడియెట్ చదువుతున్న కేదారి సాయిదుర్గ రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీలకు ఎంపికై ంది. సోమవారం సాయిదుర్గను కళాశాల పాలకవర్గ అధ్యక్ష, కార్యదర్శులు నడింపల్లి సుబ్బరాజు, తాతా అవధాని, పరిపాలనాధికారి ఎ.వెంకటపతిరాజు, ప్రిన్సిపాల్ వడలి సుబ్బారావు, పీడీ సురేష్‌కుమార్, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది అభినందించారు.
సెపక్‌తక్రాలో నలుగురి ఎంపిక
అల్లవరం: కోడూరుపాడు ఉన్నత పాఠశాలలో చదువుతున్న ముగ్గురు విద్యార్థులు రాష్ట్ర స్థాయి సెపక్‌తక్రా పోటీలకు ఎంపికయ్యారని పీడీ బూల చిరంజీవి సోమవారం తెలిపారు. విజయవాడలో అక్టోబర్‌లో జరగనున్న రాష్ట్ర స్థాయి సెపక్‌తక్రా పోటీల్లో పాల్గొననున్నారని తెలిపారు. కొడమంచిలి షణ్ముఖ, పీడీవీ సత్యలావణ్య రెగ్యులర్ క్రీడాకారులుగా, సత్యశ్యామల, ఉమ్మడిశెట్టి రత్నకుమారి స్టాండ్ బైగా ఎంపికయ్యారని తెలిపారు. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై న క్రీడాకారులను సర్పంచ్ నడింపల్లి సుబ్రహ్మణ్యంరాజు అభినందించి వారికి నగదు బహుమతి అందజేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఏఎస్ శ్రీనివాసరావు, ఉప సర్పంచ్ ముమ్మడివరపు సుధీర్, పిల్లా ప్రసాద్ తదితరుల సహకారంతో క్రీడాకారులకు షూ అందజేశారు.

రాష్ట్ర స్థాయి పోటీలకు పలువురి ఎంపిక