ఉత్సాహ భరితంగా స్పోర్ట్స్‌ మీట్‌ | - | Sakshi
Sakshi News home page

ఉత్సాహ భరితంగా స్పోర్ట్స్‌ మీట్‌

Sep 15 2025 8:17 AM | Updated on Sep 15 2025 8:17 AM

ఉత్సా

ఉత్సాహ భరితంగా స్పోర్ట్స్‌ మీట్‌

ఈనెల 27 నుంచి ఏలూరులో జరిగే

రాష్ట్ర స్థాయి పోటీలకు క్రీడాకారుల ఎంపిక

జిల్లాలో పలు పాఠశాలల నుంచి హాజరైన క్రీడాకారులు

కాకినాడ రూరల్‌: విజయం కోసం పరుగు పడుతూ.. వారిలో ప్రతిభను బయటకు చాటారు. పరుగులోనే కాదు షాట్‌పుట్‌, లాంగ్‌ జంప్‌ ఇలా స్టోర్స్‌ ఏదైనా విజయం సాధించడమే లక్ష్యంగా తమలోని క్రీడా స్ఫూర్తిని చాటుకుంటూ విజయం సాధించారు. జిల్లాలోని పలు వివిధ మండలాల్లో పాఠశాల నుంచి వచ్చిన క్రీడాకారులు. కాకినాడ డిస్ట్రిక్ట్‌ అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జూనియర్‌ అథ్లెటిక్స్‌ ఎంపిక కోసం కాకినాడ రూరల్‌ రమణయ్యపేటలోని ఏపీఎస్పీ 3వ బెటాలియన్‌ ప్రాంగణం వేదికయింది. ఉత్సాహ భరిత వాతావరణంలో పరుగు పందెం, లాంగ్‌జంప్‌, షాట్‌పుట్‌, జావెలిన్‌ త్రో వంటి పోటీలు జరిగాయి. అండర్‌–14, అండర్‌–16, అండర్‌–18, అండర్‌–20 బాల, బాలికల విభాగాల్లో పోటీలు జరిగాయి, పోటీలో విజయం సాధించిన వారిలో 67 మందిని జిల్లా నుంచి రాష్ట్ర పోటీలకు ఎంపిక చేశారు. ఈ నెల 27, 28, 29 తేదీల్లో ఏలూరులో జరిగే రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్‌ పోటీల్లో ఎంపికై న క్రీడాకారులు పాల్గొంటారు. విజేతలకు ఏపీఎస్పీ బెటాలియన్‌ కమాండెంట్‌ నాగేంద్రరావు, అసోసియేషన్‌ అధ్యక్షుడు, ఎంఈఓ రంగారావు, కార్యదర్శి సుబ్రహ్మణ్యేశ్వరరావు మెమెంటోలు అందజేసి, అభినందనలు తెలిపారు. కోచ్‌లు రెడ్డి, ప్రవీణ్‌కుమార్‌, భాను, గిరి, వీరబాబు, రాజేష్‌ఖన్నా, సంతోష్‌, రాజు, శివ, హరిబాబు, కిరణ్‌, దీపిక, అఖిల్‌ తదితరులు పోటీలు స్పోర్ట్స్‌ మీట్‌ను విజయవంతంగా నిర్వహించారు.

జిల్లా కబడ్డీ జట్లు ఇవే..

సామర్లకోట: రాష్ట్ర స్థాయి 51వ జూనియర్‌ కబడ్డీ పోటీల్లో పాల్గొనడానికి జిల్లా బాలికల, బాలుర జట్లను కాకినాడ పీఆర్‌ కళాశాల ఇండోర్‌ స్టేడియంలో ఎంపిక చేసిన్నట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి కొండపల్లి శ్రీనివాస్‌ తెలిపారు. ఆదివారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఎంపిక అయిన జిల్లా జట్లు ఈనెల 22 నుంచి 25 వరకు ఎన్టీఆర్‌ జిల్లా గొల్లపూడిలో జరిగే రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొన వలసి ఉంటుందన్నారు. ఇంటర్నేషనల్‌ కోచ్‌ పోతుల సాయిప్రసాద్‌, జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ కోశాధికారి నిమ్మకాయల కిరణ్‌కుమార్‌, పీడీలు తాళ్లూరి వైకుంఠం, ఎం.శ్రీనివాసుకుమార్‌, శ్యామ్‌, శ్వేతల పర్యవేక్షణలో ఎంపిక జరిగిందన్నారు.

బాలుర జట్టు

కాకినాడ జిల్లా కబడ్డీ జట్టుకు ఎస్‌.అవినాష్‌, పి.హరీష్‌, ఎన్‌.వంశీ, కె.జాన్‌, పి.అనిల్‌కుమార్‌, కేఎస్‌ సాయి, ఆర్‌.సాయిరామ్‌, బి.ఎలీషా, యు.వీరచక్ర, ఈ.నరేంద్ర, పీఎల్‌ నారాయణ, జి.త్రిమూర్తులు, జి.నరేష్‌, బి.ఫణికుమార్‌ ఎంపికయ్యారని తెలిపారు.

బాలికల జట్టు

జి.పావనీ, ఎ.మౌనిక, బి.మంజులరాణి, కె.జీవనజ్యోతి, బీఎన్‌ పల్లవి, ఎం.మానస, కె.అరుణ, జె.లక్ష్మీదుర్గ, ఎంవీడీ మహాలక్ష్మి, వి.పాప, కె.గాయత్రి, జి.సత్యశ్రీవల్లి, పి.ఆదిలక్ష్మి, ఏజీ భవాని, పి.శ్రావణి ఎంపికయ్యారని వివరించారు.

ఉత్సాహ భరితంగా స్పోర్ట్స్‌ మీట్‌1
1/1

ఉత్సాహ భరితంగా స్పోర్ట్స్‌ మీట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement