
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్రగాయాలు
తాళ్లరేవు: జాతీయ రహదారి 216లో పోలేకుర్రు పంచాయతీ సుంకటరేవులో జరిగిన రోడ్డు ప్రమాదంలో నాగబత్తుల షడ్రక్‌కు తీవ్ర గాయాలయ్యాయి. కోరంగి ఎస్‌ఐ పి.సత్యనారాయణ తెలిపిన వివరాల మేరకు సుంకరపాలెం పంచాయతీ బాబానగర్ గ్రామానికి చెందిన షడ్రక్ ద్విచక్రవాహనంపై కాకినాడ వైపు వెళ్తుండగా, ఎదురుగా వస్తున్న బొలేరో వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో షడ్రక్ తలకు బలమైన గాయం కావడంతో తీవ్ర రక్తస్రావమైంది. స్థానికులు హుటాహుటిన 108లో కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.