
మార్కెట్‌లోకి కియా కారెన్స్ క్లావిస్ ఎలక్ట్రికల్ కార
రాజమహేంద్రవరం సిటీ: నగరంలోని కంటిపూడి కియా షోరూంలో మంగళవారం కియా కారెన్స్ క్లావిస్ ఇండియాలో మొట్టమొదటి 7 సీటర్ ఫ్యామిలీ ఈవీని కంటిపూడి గ్రూప్ చైర్మన్ కంటిపూడి సర్వరాయుడు చేతుల మీదుగా మార్కెట్‌లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కారు సింగిల్ చార్జ్‌తో 490 కిమీ రేంజ్ కలిగి ఉందన్నారు. అధిక సామర్థ్యంతో 10 శాతం నుంచి 80 శాతం కేవలం 39 నిమిషాల్లో ఫాస్ట్ చార్జింగ్, లాంగ్ డ్రైవ్‌లకు సరిపోతుందన్నారు. దేశవ్యాప్తంగా 11,000 ప్లస్ చార్జి పాయింట్ ఆపరేటర్స్‌నీ కే, చార్జ్‌తో లొకేట్ చేసుకోవచ్చునన్నారు. 51.4 కేడబ్ల్యూహెచ్ లిథియం అయాన్ బ్యాటరీ, ఐ–పెడల్ 4–లెవెల్ రీజనరేటివ్ బ్రేకింగ్, ప్యాడల్ షిఫ్టర్, లెవెల్ 2 సేఫ్టీ ఫీచర్లు, డ్యూయల్ పానారోమిక్ సన్‌రూఫ్, 6 ఎయిర్‌బ్యాగ్స్, 12.3 టచ్‌స్క్రీన్ కాక్‌పిట్, 8 బోస్ స్పీకర్లతో ప్రీమియం ఆడియో, స్మార్ట్ డాష్‌క్యామ్ డ్యూయల్ కెమెరాతో, ఎయిర్ ప్యూరిఫయర్ ఏక్యూఐ డిస్‌ప్లేతో, పర్యావరణ హితమైన ప్రయాణం, ఆధునిక సాంకేతికతతో అనుభూతిని మిళితం చేసే విధంగా ఉందన్నారు. కంటిపూడి గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ కె.వినయ్ బాబు, ఎం.జగన్, సీహెచ్. సత్యనారాయణమూర్తి (చినబాబు), కె.మన్మోహన్‌రామ్, సి.ఈ.ఓ. సూర్య, ఎస్.ఎం కోమల పాల్గొన్నారు.