
సారా విక్రేతపై పీడీ యాక్టు
సామర్లకోట: సారా విక్రయం చేస్తూ ఇప్పటి వరకు ఆరు పర్యాయాలు కేసు నమోదు అయిన పండ్రవాడ గ్రామానికి చెందిన గెద్దాడ రాఘవకు పీడీ యాక్టు నిర్బంధ ఉత్తర్వులు జారీ చేశామని కాకినాడ, ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ సీఐ కె.రామమోహనరావు మంగళవారం తెలిపారు. ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ 2023 డిసెంబర్ నుంచి ఆమైపె నాటు సారా విక్రయం కేసులు నమోదు చేశామన్నారు. ఎన్ని కేసులు పెట్టినా ఆమె సారా వ్యాపారం చేస్తున్న కారణంగా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ఇచ్చిన నివేదిక ఆధారంగా కాకినాడ జిల్లా కలెక్టర్ రాఘవపై పీడీ యాక్టు ఉత్తర్వులు ఇచ్చారన్నారు. ఈ మేరకు ఆమెను మంగళవారం రాజమహేంద్రవరం ప్రత్యేక మహిళా కారాగారానికి అప్పగించామని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న నవోదయంలో భాగంగా ఈ పీడీ యాక్టు నమోదు చేశామని చెప్పారు. దీనిని దృష్టిలో ఉంచుకొని సారా తయారీ, అమ్మకాలకు దూరంగా ఉండాలని సీఐ హెచ్చరించారు.
పదిమందికి పదోన్నతులు
కాకినాడ సిటీ: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజాపరిషత్ పరిధిలో పనిచేస్తున్న ఏడుగురు జూనియర్ అసిస్టెంట్లకు, ముగ్గురు టైపిస్టులకు సీనియర్ అసిస్టెంట్‌లుగా పదోన్నతి కల్పిస్తూ జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు నియామకపు ఉత్తర్వులు అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ వేణుగోపాలరావు మాట్లాడుతూ ఖాళీలు ఏర్పడగానే అర్హులైన ఉద్యోగులకు పదోన్నతిపై నియామకపు ఉత్తర్వులు వెంటనే జారీ చేస్తున్నట్లు తెలిపారు. ఉత్సాహంతో విధులు నిర్వర్తించి ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రజాసేవలో ముందుంటూ పంచాయతీరాజ్ సంస్థలను ప్రగతి పథంలో నడిపించడంలో భాగస్వామ్యం వహించాలని కోరారు. జెడ్పీ సీఈవో వీవీవీఎస్ లక్ష్మణరావు, ఉపముఖ్య కార్యనిర్వహణాధికారి జీఎస్ రామ్‌గోపాల్, ఏపీపీఆర్ మినిస్టీరియల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌వీవీ రమేష్ పాల్గొన్నారు.
నేడు జిల్లాస్థాయి జూనియర్ టార్గెట్ బాల్ జట్ల ఎంపిక
చాగల్లు: చాగల్లు జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఈ నెల 8,9 తేదీలలో జరిగే రాష్ట్రస్థాయి జూనియర్ టార్గెట్ బాల్ పోటీల్లో పాల్గొనేందుకు జిల్లా జట్టును బుధవారం పాఠశాల ప్రాంగణంలో ఎంపిక చేయనున్నట్లు జిల్లా కార్యదర్శి విజయలక్ష్మి మంగళవారం తెలిపారు. ఎంపిక పోటీల్లో పాల్గొనే విద్యార్థులు ఆధార్‌కార్డుతో హాజరుకావాలని ఆమె పేర్కొన్నారు.

సారా విక్రేతపై పీడీ యాక్టు