
యూరియా కోసం అగచాట్లు
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం విత్తు నుంచి విక్రయం వరకూ రైతులకు అన్నింటా భరోసా ఇచ్చింది. రైతు భరోసా కేంద్రాల ద్వారా అండగా నిలిచింది. నేడు ఎరువులు, విత్తనాలు లేక రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అమ్ముకుందామంటే కొనేవారు లేక.. సరైన గిట్టుబాటు ధర దక్కక రైతులు పడుతున్న బాధలు చూస్తే కంట నీరు వస్తోంది. రాజానగరం నియోజకవర్గం కావచ్చు, జిల్లాలో కావచ్చు.. చాలా చోట్ల యూరియా దొరకగా లైనులో నిలుచుని రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. రైతులకు ప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలి. లేకపోతే పోరుబాటు పడతాం.
– జక్కంపూడి రాజా, వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే