
ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య
రౌతులపూడి: మండల కేంద్రమైన రౌతులపూడిలో లోకారపు చిన్న అప్పలనాయుడు (79) ఉరి వేసుకుని మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలావున్నాయి. రౌతులపూడి గ్రామానికి చెందిన మృతుడు లోకారపు చిన్న అప్పలనాయుడుకు గత 20 ఏళ్లుగా ఆయాసం, కడుపునొప్పి, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నాడు. రెండురోజుల క్రితం ఆయాసంగా వుందని చెప్పగా అన్న కొడుకు అయిన లోకారపు దేవుడు స్థానికంగావున్న సీహెచ్‌సీకి తీసుకువెళ్లి జాయిన్ చేశాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. గురువారం ఉదయం ఆరు గంటలకు సిబ్బంది లేచి చూసేసరికి ఆసుపత్రి ఆవరణలోవున్న మామిడి చెట్టుకు ఆతని లుంగీ, టవల్‌తో ఉరి వేసుకుని చెట్టుకింద పడిపోయి మృతిచెందినట్లు గుర్తించారు. దీంతో స్థానిక పోలీస్‌స్టేషన్‌కు ఫిర్యాదు చేయగా ఎస్సై వెంకటేశ్వరరావు తన సిబ్బందితో కలసి మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తుని ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తామని ఎస్సై తెలిపారు.
డొక్కా సీతమ్మ ఐదో తరం
వారసుడు భీముడు మృతి
పి.గన్నవరం: నిరతాన్నధాత్రిగా పేరొందిన డొక్కా సీతమ్మ వారి ఐదోతరం వారసుడు, ఎల్.గన్నవరం గ్రామానికి చెందిన డొక్కా భీమ వెంకట సత్య కామేశ్వరరావు (భీముడు) (59) బుధవారం రాత్రి మృతి చెందారు. ఆయన ఎల్.గన్నవరంలో బ్రాంచి పోస్టు మాస్టర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. గత కొంతకాలంగా భీముడు అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన పార్థివదేహానికి గురువారం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ తదితరులు పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు.
న్యాయం గెలిచింది
తమపై కేసు కొట్టి వేయడంతో వైఎస్సార్ సీపీ నేతల హర్షం
అనపర్తి : అధికారుల విధులకు ఆటంకం కల్పించారంటూ వైఎస్సార్ సీపీ నేతలపై పెట్టిన కేసును కొట్టివేస్తూ అనపర్తి జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి మజ్జి వంశీకృష్ణ గురువారం తీర్పు వెలువరించారు. ఈ తీర్పు పట్ల వైఎస్సార్ సీపీ శ్రేణులు స్పందిస్తూ న్యాయం గెలిచిందంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వివరాల్లోకి వెళితే 2018లో మహేంద్రవాడ గ్రామంలో స్థానిక గుడిమెట్ల వారి గుడి వీధిలో మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం ఏర్పాటు చేయడానికి స్థానిక వైఎస్సార్ సీపీ నాయకులు సంకల్పించి సిమెంటు దిమ్మెను నిర్మించామని పోతంశెట్టి శ్రీను తెలిపారు. ఆ దిమ్మెను అప్పటి అధికార తెలుగుదేశం పార్టీ నేతల ఒత్తిడి మేరకు పంచాయతీ అధికారులు తొలగిస్తుంటే అడ్డుకున్న తనతో పాటు వైఎస్సార్ సీపీ నాయకులు కొవ్వూరి ధర్మారెడ్డి, కొవ్వూరి జగ్గారెడ్డి, పడాల ధర్మారెడ్డి, మల్లిడి గంగరాజులపై విధులకు ఆటంకం కలిగించారంటూ పంచాయతీ కార్యదర్శి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు అయిందన్నారు. విచారణ అనంతరం ఈ కేసును కొట్టివేస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించినట్టు శ్రీనివాసరెడ్డి తెలిపారు. తమ పై అన్యాయంగా మోపిన కేసులో స్థానిక న్యాయవాది మన్మోహన్ శ్రీనివాసరెడ్డి వాదనలు వినిపించారని వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని పోతంశెట్టి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కాగా నిందితుల్లో ఒకరైన కొవ్వూరి ధర్మారెడ్డి కేసు నడుస్తుండగానే మృతిచెందారని ఆయన తెలిపారు.

ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య