
అమ్మవార్లకు 1400 కిలోల భారీగా సారెలు
తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలులోని మదుగులమ్మ, నూకాలమ్మ అమ్మవార్లకు గురువారం భక్తులు 1400 కిలోల భారీ సారెలు సమర్పించారు. బిక్కవోలు తాళ్ళవారి ఆడపడుచు మదుగులమ్మ తల్లికి స్థానిక మహిళలు ఇంటి వద్ద చేసిన పలు రకాల 800 కిలోల పిండివంటలు సమర్పించారు. అలాగే పసుపు, కుంకుమ, గాజులు, అరటి పండ్లు, కొబ్బరి కాయలు, చీరలు, పండ్లు కూడా అందజేశారు. తొలుత శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి ఆలయానికి చేరుకుని, అక్కడి నుంచి అమ్మవారికి గ్రామోత్సవం నిర్వహించి, సారె సమర్పించారు. అలాగే, నూకాలమ్మ తల్లికి పసుపు, కుంకుమ, గాజులు, అరటి తదితర పండ్లతో పాటు 600 కిలోల స్వీట్లు సమర్పించారు. రెండు ఆలయాల వద్ద అమ్మవార్లకు సమర్పించిన సారెలను భక్తులకు పంపిణీ చేశారు.
– బిక్కవోలు

అమ్మవార్లకు 1400 కిలోల భారీగా సారెలు