
అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం సిటీ): రాజమహేంద్రవరంలోని ఎస్.కె.ఆర్. ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకులుగా పనిచేయడానికి మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రాఘవకుమారి బుధవారం ఒక ప్రకటనలో తెలియచేశారు. జువాలజీ, కంప్యూటర్ సైన్స్, బోటనీ, ఫిజిక్స్, ఇంగ్లిష్, తెలుగు, ఎకనామిక్స్, పొలిటికల్ సైనన్స్ , కామర్స్‌లో ఖాళీలున్నాయన్నారు. అభ్యర్థులు సంబంధిత సబ్జెక్ట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి కనీసం 55 శాతం మార్కులు సాధించి ఉండాలన్నారు. ఆసక్తి ఉన్న మహిళా అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈ నెల 19 తేదీ లోపు కళాశాల ఆఫీసుకు అందజేయాలన్నారు. ఇంటర్వ్యూలు ఈ నెల 23వ తేదీన ఉదయం 9 గంటలకు నిర్వహిస్తామన్నారు. అభ్యర్థులు తమ అసలు సర్టిఫికెట్లు, జిరాక్స్ కాపీలు వెంట తీసుకుని రావాలన్నారు. వివరాలకు 9398677385, 9866131354 నంబర్లలో సంప్రదించాలన్నారు.
50 ఏళ్లకే పింఛన్
ఎక్కడ బాబూ?
కూటమి ప్రభుత్వానికి ఆరిఫ్ సూటి ప్రశ్న
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం మైనార్టీలకు ఇచ్చిన హామీల పట్ల ప్రదర్శిస్తున్న నిర్లక్ష్య వైఖరి అత్యంత బాధాకరమని జిల్లా వక్ఫ్ బోర్డ్ మాజీ చైర్మన్, వైఎస్సార్ సీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి మొహమ్మద్ ఆరిఫ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు 50 ఏళ్లు దాటిన మైనారిటీలకు పెన్షన్ అందిస్తామని హామీ ఇచ్చిందని, అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా మార్గదర్శకాలు రూపొందించలేదన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆరు నెలకొకసారి కొత్త పెన్షన్లు ప్రకటించేవారని చెప్పారు. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ ఏడాది కాలంలో ఎంతమందికి నూతన పింఛన్లు అందించారో చెప్పాలన్నారు. మైనార్టీలకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు పరిచే కార్యక్రమం చేపట్టాలని, లేనిపక్షంలో ఆందోళన చేస్తామని అన్నారు.
వైద్య సిబ్బందికి
ఆర్పీఎస్కే ట్రైనింగ్
రాజమహేంద్రవరం రూరల్: రాష్ట్రీయ బాల స్వాస్త కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న పాఠశాల విద్యార్థులకు, అంగన్‌వాడీ పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహిస్తామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కెవెంకటేశ్వరరావు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. దీనిలో భాగంగా జిల్లా స్థాయిలో ఉన్న మెడికల్ ఆఫీసర్లకు, ఏఎన్‌ఎం,ఎమ్‌ఎల్ హెచ్‌పీలకు డీఈఐసీ పీడియాట్రిషన్ డాక్టర్ ఇంద్రజ ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహించారన్నారు. ప్రతి విద్యార్థి వివరాలను హెల్త్ కార్డులో నమోదు చేసి, వారి అనారోగ్య సమస్యలకు అవసరమైన చికిత్సలను అందించనున్నట్లు తెలిపారు. పుట్టుకతో వచ్చే శారీరక, మానసిక లోపాలను గుర్తించి వారికి సరైన వైద్య సేవలను అందించేందుకు జిల్లా బాలల సత్వర చికిత్స కేంద్రం (డైస్) రాజమహేంద్రవరం నకు రిఫర్ చేస్తామని తెలిపారు. ముందుగానే సమస్యను గుర్తించి చికిత్స అందించాలని లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
ఎరువుల
దుకాణంలో తనిఖీలు
శంఖవరం: మండలంలోని కత్తిపూడిలో విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఎరువుల దుకాణాలపై బుధవారం ఆకస్మిక దాడులు చేశారు. ఈ దాడుల్లో భాగంగా స్థానిక భక్తాంజనేయ ఫెర్టిలైజర్స్ దుకాణంలో తనిఖీలు నిర్వహించగా రూ.2,49,200 విలువైన వరి విత్తనాలు, రూ.2,05,347 విలువైన ఎరువుల విక్రయాలు నిలిపివేశారు. గొడౌన్‌లో ఉన్న స్టాకు రిజిస్టరులో స్టాకుకు వ్యత్యాసం, రికార్డులు సక్రమంగా లేకపోవటంతో వాటిని నిలిపివేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ తనిఖీల్లో వ్యవసాయ సంచాలకుడు షంషీ, విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్‌ఐ పి.శివరామకృష్ణ, ఏఓ పి.గాంధీ, ఏఈఓ ఆర్.మౌళిప్రసాద్ పాల్గొన్నారు.

అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం