
రోగులతో స్నేహంగా మెలగాలి
పెరవలి: ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు మెరుగైన సేవలు అందించటంతో పాటు రోగుల పట్ల స్నేహంతో మెలగాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాదికారి జి.వెంకటేశ్వరరావు తెలిపారు. పెరవలి, కానూరు ఆరోగ్య కేంద్రాలల్లో బుధవారం అకస్మిక తనిఖీలు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రోగి కండీషన్‌ను బట్టి ఇక్కడ ఉంచాలో లేక ఏరియా ఆసుపత్రికి తరలించాలో సత్వరమే నిర్ణయం తీసుకోవాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పురుడు పోసుకుంటే తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉంటారని, ఈ విషయాన్ని ప్రచారం చేయాలని తెలిపారు. ప్రభుత్వం అందించే సంక్షేమ కార్యక్రమాలు రోగులకు, ప్రజలకు తెలిసేలా వైద్య సిబ్బంది వ్యవహరించాలన్నారు. ఆసుపత్రి పరిసరాలు పరిశీలించటంతో పాటు రోగుల దగ్గరకు వెళ్లి సిబ్బంది అందిస్తున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. రికార్డులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. పెరవలి పీహెచ్‌సీ వైద్యులు ఆర్‌ఎస్‌ఎస్‌పి ప్రసాద్, తేజశ్రీ, కానూరు పీహెచ్‌సీ వైద్యులు హేమరాజు, తేజశ్రీ పాల్గొన్నారు.