
షణ్ముఖ వ్యూహం విఫలం
మాజీ సీఎం వైఎస్ జగన్‌ను ఓడించలేమనే భయంతోనే చంద్రబాబు కూటమి కట్టారు. అందమైన అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు. షణ్ముఖ వ్యూహం పేరుతో కూటమి పార్టీలు హామీలిచ్చాయి. 50 ఏళ్లు నిండిన ఎస్సీ, బీసీలకు పింఛను వంటి నోటికొచ్చిన హామీలు గుప్పించారు. ఇస్తానన్న సూపర్ సిక్స్ పథకాలే ఇవ్వడం లేదు. ప్రతిపక్షం నోరెత్తకుండా బెదిరింపు ధోరణి అవలంబిస్తున్నారు. అందుకే ‘బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ’ పేరుతో ప్రజల్లోకి వెళుతున్నాం. బాబు హామీలపై ప్రజల పక్షాన ప్రశ్నిస్తాం. అమలు చేసే వరకూ పోరాటాలు ఉధృతం చేస్తాం.
– కురసాల కన్నబాబు, మాజీ మంత్రి,
వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజినల్ కో ఆర్డినేటర్
మోసం చేసి అధికారం
ఎన్నికల ముందు ఎన్నో హామీలు గుప్పించి, అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్న చంద్రబాబు తీరును ఎండగడతాం. మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై అసత్య ప్రచారం చేసి, ప్రజలను మోసం చేసి, కూటమి అధికారంలోకి వచ్చింది. ఏడాది పాలనలోనే ఈ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. బాబు మోసాలను జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకూ ప్రతి ఇంటికీ వెళ్లి ప్రచారం చేస్తాం. ఇందుకు పార్టీ శ్రేణులు, కార్యకర్తలు సన్నద్ధం కావాలి.
– చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు
అన్ని వర్గాలకూ వెన్నుపోటు
సూపర్ సిక్స్ పేరిట అడ్డగోలు హామీలు గుప్పించి, అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం.. వాటిని అమలు చేయకుండా అన్ని వర్గాల ప్రజలకూ వెన్నుపోటు పొడిచింది. శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణకు జిల్లా రాజకీయాలపై అవగాహన ఉంది. ఆయన రాకతో ప్రతి సామాన్య కార్యకర్తకూ ధైర్యం వచ్చింది. ఆయన చూపిన మార్గంలో చంద్రబాబు మోసాలను గ్రామ స్థాయిలో ప్రతి ఇంటికీ తీసుకెళ్తాం. ప్రజలకు బాబు చేస్తున్న దగాను వివరిస్తాం.
– జక్కంపూడి రాజా, మాజీ ఎమ్మెల్యే,
వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు
సీబీఎన్ అంటే చీటింగ్
చంద్రబాబు నాయుడు (సీబీఎస్) అంటే చీటింగ్, బాదు డు, నేరాలు. అబద్ధపు హామీలతో ప్రజలను చీట్ చేశారు. విద్యుత్ చార్జీలు, నిత్యావసరాల ఽనిత్యావసరాలు, పెట్రోల్ ధరలు పెంచి ప్రజలపై భారం మోపారు. మహిళలపై అత్యాచారాలు, హత్యలతో నేరాలు పెరిగిపోయాయి. చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలు అన్నీ ఇచ్చేశామనగానే ప్రజలంతా అవాక్కయ్యారు. సోషల్ మీడియా, మీడియా ద్వారా చైతన్యమవుతున్నారు. ప్రతి ఒక్కరూ కూటమి ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు సిద్ధంగా ఉన్నారు.
– తానేటి వనిత, మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ గోపాలపురం నియోజకవర్గ కో ఆర్డినేటర్

షణ్ముఖ వ్యూహం విఫలం

షణ్ముఖ వ్యూహం విఫలం

షణ్ముఖ వ్యూహం విఫలం