
పీతల సరఫరాలో ఘరానా మోసం
కాట్రేనికోన: పచ్చ పీత పిల్లలకు సొమ్ము చెల్లిస్తే మండ పీత పిల్లలను అంటగట్టి రైతులకు కుచ్చుటోపీ పెట్టిన ఘటన పల్లం గ్రామంలో చోటు చేసుకుంది. మండలం పల్లం గ్రామానికి చెందిన 26 మంది రైతులు 50 ఎకరాలు పీతల చెరువులు లీజుకు చేస్తున్నారు. పచ్చ పీత పిల్లల కోసం స్థానికం హేచరీ అందుబాటులో లేక పోవడంతో మద్రాసుకు చెందిన హేచరీ నుంచి పీత పిల్లలను పల్లం గ్రామానికి చెందిన పాలెపు శ్రీను, సంగాని సత్యంకు సొమ్ము చెల్లించారు. 26 మంది రైతులు ఒక పీత పిల్లకు రూ.23 చొప్పున 60 వేల పిల్లలకు రూ.14 లక్షలను దళారులు పాలెపు శ్రీను, సంగాని సత్యంలకు చెల్లించారు. అయితే పచ్చ పీత పిల్లలకు బదులు నకిలీ పీతలను (మండ పీతల) సరఫరా చేయడంతో తీవ్రంగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి వేళ చెరువులో పీత పిల్లలను వదలడం, సీడ్ దశలో ఉండడం వల్ల అసలో నకిలీయో తెలియదని వారు పేర్కొన్నారు. చెరువులో పీతలు వేసి 20 రోజులు పైబడిందని, పచ్చ పీతలకు బదులు మండ పీతలని తేలడంతో మోసపోయినట్టు గుర్తించామని, మండ పీత పిల్లలను సరఫరా చేసిన హేచరీ యాజమాన్యం పైన, దళారులపై కేసు నమోదు చేయాలని కోరుతూ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దళారులు
మోసం
చేశారని
ఆవేదన
వ్యక్తం
చేస్తున్న
రైతులు
పచ్చ పీతలకు బదులు మండ పీతలు
పంపిన హేచరీ యాజమాన్యం
రూ.14 లక్షలు నష్టపోయిన రైతులు