
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు
ప్రత్తిపాడు: జాతీయ రహదారిపై ప్రత్తిపాడు వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. బైక్‌ను వెనుక నుంచి వస్తున్న కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బైక్‌తో పాటు యువకులు కూడా సుమారు వంద మీటర్ల దూరంలో ఎగిరి పడ్డారు. స్థానిక పోలీసుల కథనం మేరకు పెద్దాపురం గ్రామానికి చెందిన నవుడు వీర వెంకట మణికంఠ తన స్నేహితుడు కిషోర్‌తో కలిసి బైక్‌పై ప్రత్తిపాడులోని ఓ వివాహ వేడుకకు హాజరయ్యేందు వస్తున్నాడు. స్థానిక హైవేపై నరేంద్రగిరి వద్ద వీరి బైక్‌ను జగ్గంపేట నుంచి అన్నవరం వైపు వెళ్తున్న కారు వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ఘటనలో బైక్‌తో పాటు యువకులు లంపకలోవ రోడ్డులో ఎగిరి పడ్డారు. తీవ్రంగా గాయపడిన మణికంఠ, కిషోర్‌లను 108 అంబులెన్సులో ప్రత్తిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం వారిని కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. ప్రత్తిపాడు ఎస్సై ఎస్.లక్ష్మీకాంతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.