
గ్రేడ్–2 హెచ్‌ఎం బదిలీలకు 245 దరఖాస్తులు
రాయవరం: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో గ్రేడ్–2 ప్రధానోపాధ్యాయుల బదిలీలకు 245 దరఖాస్తులు వచ్చాయి. గ్రేడ్–2 ప్రధానోపాధ్యాయుల బదిలీలకు ఈ నెల 21, 22 తేదీల్లో దరఖాస్తులు చేసుకున్నారు. ఈ బదిలీ దరఖాస్తుల్లో రిక్వెస్ట్ బదిలీలకు 181 దరఖాస్తులు రాగా, తప్పనిసరి బదిలీలకు 64 దరఖాస్తులు వచ్చాయి. వచ్చిన దరఖాస్తులను రెండు దశల్లో వెరిఫికేషన్ చేస్తున్నారు.
44 సమ్మర్ వీక్లీ స్పెషల్ రైళ్లు
రాజమహేంద్రవరం సిటీ: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని జూన్ ఒకటో తేదీ నుంచి జూలై 31వ తేదీ వరకు రాకపోకలు సాగించేందుకు 44 సమ్మర్ వీక్లీ స్పెషల్ రైళ్లను ప్రకటిస్తూ రైల్వే అధికారులు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. విశాఖపట్నం– ఎస్‌ఎంబీటీ బెంగళూరు, ఎస్‌ఎంబీటీ బెంగళూరు (08581/ 08582) రైళ్లు జూన్ 1వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకు ప్రతీ సోమ, మంగళ వారాల్లో రాకపోకలు సాగించనున్నాయి. విశాఖపట్నం –తిరుపతి, తిరుపతి విశాఖపట్నం (08547/ 08548) రైళ్లు జూన్ 6వ తేదీ నుంచి జూలై 31వ తేదీ వరకు ప్రతీ బుధ,గురువారాల్లో రాకపోకలు సాగించనున్నాయి. విశాఖపట్నం– చర్లపల్లి, చర్లపల్లి –విశాఖపట్నం (08579/ 08580) రైళ్లు జూన్ 6వ తేదీ నుంచి జూలై 26వ తేదీ వరకు ప్రతీ శుక్ర, శనివారాలలో రాకపోకలు సాగించనున్నాయని అధికారులు తెలిపారు. ఈ రైళ్లు సామర్లకోట, రాజమహేంద్రవరం, అన్నవరం, తుని స్టేషన్లలో ఆగనున్నాయని తెలిపారు.