
టీఐఐకేఎంతో ‘నన్నయ’కు ఒప్పందం
రాజానగరం: శ్రీలంకకు చెందిన ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నాలెడ్జ్ మేనేజ్‌మెంట్ (టీఐఐకేఎం)తో ఆదికవి నన్నయ యూనివర్సిటీకి ఒప్పందం కుదురింది. ఇందుకు సంబంధించిన పత్రాలను వీసీ ఆచార్య ఎస్. ప్రసన్నశ్రీ సమక్షంలో రిజిస్ట్రార్ ఆచార్య జి.సుధాకర్, టీఐఐకేఎం ప్రతినిధి ఇసాంక పి.గమగే పరస్పరం సంతకాలు చేసి మార్చుకున్నారు. అంతర్జాతీయ సంస్థతో ఎంఓయూ కుదరడం వల్ల రాబోయే కాలంలో అంతర్జాతీయ సదస్సుల నిర్వహణ, జాయింట్ రీసెర్చ్, వెబ్ నార్స్ వర్క్‌షాపులు, ట్రైనింగ్ ప్రోగ్రాములు, పబ్లిక్ సర్వీసెస్ వంటి కార్యక్రమాల నిర్వహణకు అవకాశం ఉంటుందన్నారు.