
దూర ప్రాంతాలకు వెళ్లాలంటే..
ప్రధాన ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హాల్ట్ లేకపోవడంతో విద్యార్థులు, మహిళలు, ఉద్యోగులు, వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. అన్ని వర్గాల ప్రజల సౌకర్యాలను దృష్టిలో పెట్టుకొని హాల్ట్ కల్పించాలి. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై వంటి ప్రాంతాలకు వెళ్లాలంటే రాజమండ్రి వెళ్లి రైలు ఎక్కాల్సిన పరిస్థితి. ప్రజాప్రతినిధులు హాల్ట్ కోసం ప్రయత్నించాలి.
– గమిని వీరన్నబాబు, వ్యాపారవేత్త, నిడదవోలు
300 గ్రామాలకు ప్రయోజనం
తిరుపతి నుంచి విశాఖ వెళ్లే ఏసీ డబుల్ డెక్కర్ ఎక్స్‌్‌ప్రెస్‌కు నిడదవోలు రైల్వేస్టేషన్లో హాల్ట్ కల్పించాలి. జన్మభూమి ఎక్స్‌్‌ప్రెస్‌కు కూడా హాల్ట్ కల్పిస్తే హైదరాబాద్ వెళ్లేందుకు ఎంతో అనువుగా ఉంటుంది. సుమారు 300 గ్రామాల ప్రజలు ఇక్కడ వాటి హాల్ట్ కోసం ఎదురుచూస్తున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు నిడదవోలు రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి పరచాలి.
– అడ్డాల ప్రభాకర్, రైతు
ఉద్యమాలు చేస్తున్నా ఫలితం లేదు
జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌కు హాల్ట్ కల్పించాల ని దశాబ్దకాలంగా ఉద్యమాలు చేస్తున్నా పట్టించుకునే నాథుడే లేడు. ఉద్యోగుల తో పాటు వ్యాపార వర్గాలు అవసరమైన రైళ్ల కోసం రాజమహేంద్రవరం, తాడేపల్లిగూడెం వెళ్తున్నారు. రైల్వే ఉన్నతాధికారులు, ఎంపీలకు వినతిపత్రాలు ఇస్తున్నా పట్టించుకోవడం లేదు. ప్రయాణికుల సౌకర్యార్థం జన్మభూమికి హాల్ట్ కల్పించాలి.
– జువ్వల రాంబాబు, సీపీఎం నాయకులు, నిడదవోలు
●

దూర ప్రాంతాలకు వెళ్లాలంటే..

దూర ప్రాంతాలకు వెళ్లాలంటే..