
అంబాజీపేట: రాష్ట్ర స్థాయి అండర్ –14 వాలీబాల్ పోటీలకు స్థానిక జెడ్పీ హైస్కూల్‌లో చదువుతున్న 9వ తరగతి విద్యార్థి ఛరిష్మ సాయి రుత్వి ఎంపికై నట్టు హెచ్‌ఎం కడలి సాయిరామ్ తెలిపారు. అంబాజీపేట హైస్కూల్‌లో సాయి రుత్విని ఉపాధ్యాయులు, విద్యార్థులు మంగళవారం అభినందించారు.
అనపర్తిలో ఈ నెల 25న జరిగిన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల వాలీబాల్ పోటీల్లో ఛరిష్మసాయిరుత్వి అత్యంత ప్రతిభ కనబర్చడంతో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై ందన్నారు. ఛరిష్మసాయిరుత్వికి శిక్షణ ఇచ్చిన పీడీ కుంపట్ల ఆదిలక్ష్మి, ఆశ్వా కమిటీ చైర్మన్ కామిశెట్టి మధుబాబులను ఉపాధ్యాయులు బి.వెంకటేశ్వరరావు, వి.సత్యనారాయణ, బీఎస్‌ఎన్.మూర్తి, విద్యార్థులు అభినందించారు. ముక్కామల జెడ్పీ హైస్కూల్‌లో 9వ తరగతి చదువుతున్న ఇసుకపట్ట సలోమి స్టాండ్ బైగా ఎంపికై నట్లు పీడీ ముత్యాల పవన్ కిషోర్ తెలిపారు.
రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ పోటీల్లో ప్రతిభ
రాజోలు: రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీల్లో ప్రతిభ చూపిన చింతలపల్లి ఉన్నత పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న యార్లగడ్డ మహేష్, కొల్లు అశోక్‌ను ప్రధానోపాధ్యాయుడు దొంగ జానకిరామయ్య మంగళవారం అభినందించారు.
విజయవాడలో జరిగిన రెజ్లింగ్ పోటీల్లో అండర్–17 విభాగంలో 80 కేజీల కేటగిరిలో మహేష్ రజత పతకం సాధించగా, అశోక్ 71 కేజీల కేటగిరిలో కాంస్య మెడల్ సాధించాడని హెచ్‌ఎం వివరించారు. ప్రతిభ చూపిన క్రీడాకారులను సర్పంచ్ మట్టా ప్రసన్నకుమారి, పీఎంసీ చైర్మన్ నల్లి నాగబాబు, మండల ఉపాధ్యక్షుడు ఇంటిపల్లి ఆనందరాజు, వ్యాయామ ఉపాధ్యాయుడు చొప్పల చంద్రశేఖర్, ఉపాధ్యాయులు అభినందించారు.

