రాజమహేంద్రవరం రూరల్: ఉద్యోగులు భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) రాజమహేంద్రవరం ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో ఈనెల 27న నిధి ఆప్‌కే నికత్–జిల్లా ఔట్‌రీచ్ ప్రోగ్రాం జరగనుంది. పీఎఫ్ అసిస్టెంట్ కమిషనర్ వైడీ శ్రీనివాస్ ఈవిషయం ఒక ప్రకటనలో తెలిపారు. పూర్వపు ఉభయ గోదావరి జిల్లాల ఖాతాదారులు ఈసేవలు వినియోగించుకోవచ్చునన్నారు. భవిష్యనిధి అంతిమ ఉపసంహరణ, ఖాతాల బదిలీ తదితర అంశాలకు సంబంధించి పరిష్కరిస్తామన్నారు. తూర్పుగోదావరిజిల్లా పరిధిలో పెద్దాపురంలో శ్రీలలితా ఎంటర్‌ప్రైజస్ ఇండస్ట్రీస్(ప్రై)లిమిటెడ్ ఆవరణలోను, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పరిధిలో ఉప్పలగుప్తం మండలం ఎస్.యానం వేదాంత లిమిటెడ్ ఆవరణలో, అల్లూరి సీతారామరాజుజిల్లా పరిధిలో రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు మేనేజ్మెంట్ రిసోర్స్‌సెంటర్ ఆవరణలో, కాకినాడజిల్లా పరిధిలో కాకినాడ ఈపీఎఫ్‌వో జిల్లా కార్యాలయంలో, ఏలూరు జిల్లా పరిధిలో ఏలూరు సీఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ కాలేజ్ ఆడియో విజువల్ హాల్‌లో, పశ్చిమగోదావరిజిల్లా పరిధిలో భీమవరం ఈపీఎఫ్‌వో జిల్లా కార్యాలయంలో ఈకార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఆయాప్రాంతాల్లో పెన్షన్ అర్హత,లెక్కించడం, క్లెయిమ్,ఉపసంహరణ..స్కీమ్ సర్టిఫికెట్, ఈ–నామినేషన్, డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్, ఇతర సంబంధిత సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ఈపీఎఫ్‌వోసభ్యులు, ఫించనుదారులు, ఎస్టాబ్లిష్మెంట్‌లు, కొత్తగా కవర్ చేసిన ఎస్టాబ్లిష్మెంట్‌లు ఈఅవుట్‌రీచ్ ప్రోగ్రామ్‌ను ఉపయోగించుకోవాలన్నారు.