సాక్షి, అమలాపురం: ‘వర్షాలు కురవాలని జిల్లాలోని పలు గ్రామాల్లో రైతులు, గ్రామస్తులు సంప్రదాయ పద్ధతిలో కప్పలకు పెళ్లిళ్లు చేసి, ఊరేగింపులు నిర్వహిస్తున్నారు. భజనలు చేస్తూ గ్రామ దేవతలను ప్రార్థించి వరుణుడు కరుణించాలని వేడుకుంటున్నారు. ఆకాశంలో మేఘాలు వస్తున్నాయి. కానీ, వాన జాడ మాత్రం కానరావడం లేదు. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించినప్పటి నుంచీ వాన కోసం ఆకాశం వైపు ఆశగా చూస్తున్న కోనసీమ రైతన్నకు నిరాశే ఎదురవుతోంది. చినుకు రాలకపోవడంతో కోనసీమలో వాతావరణం రెండో వేసవిని తలపిస్తోంది. ఎల్‌నినో ప్రభావంతో నైరుతి రుతుపవనాలు బలహీనపడటంతో పొలాలు బీటలువారుతుండగా, నారుమడులు ఎండిపోతున్నాయి. సాగు ప్రారంభ దశలోనే రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.
కానరాని వరద జాడ
వర్షాభావం ప్రభావం జీవనది గోదావరి ప్రవాహంలోనూ స్పష్టంగా కనిపిస్తోంది. గత ఏడాది ఇదే సమయానికి ధవళేశ్వరం బ్యారేజీ వద్ద వరద ఉధృతి కనిపించగా, ఈ ఏడాది ఆ జాడే లేదు. బ్యారేజీ నుంచి ఆదివారం 14,400 క్యూసెక్కుల మిగులు జలాలను మాత్రమే సముద్రంలోకి విడిచిపెట్టారు. గత ఏడాది ఇదే రోజున 2,16,302 క్యూసెక్కుల వరద నీరు సముద్రంలోకి వెళ్లింది. జూన్ 1 నుంచి జూలై 25 వరకూ ధవళేశ్వరం బ్యారేజీకి మొత్తం 85.151 టీఎంసీల నీరు మాత్రమే చేరగా, గత ఏడాది ఇదే కాలవ్యవధిలో ఏకంగా 472.792 టీఎంసీలు వచ్చాయి. దాదాపు ఐదో వంతు కూడా నీటి లభ్యత లేకపోవడాన్ని బట్టి గోదావరి పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
మున్ముందు మరింత ఇబ్బందికరం
వర్షాలు లేకపోవడంతో ఇప్పటికే డెల్టాలో వరి నారుమడులు ఎండిపోతున్నాయి. కొబ్బరి, అరటి, కూరగాయల వంటి ఉద్యాన పంటలు నీటి కోసం ఎదురు చూస్తున్నాయి. ముఖ్యంగా గోదావరి లంక ప్రాంతాలు, మోటార్ల సౌకర్యం లేని డెల్టా శివార్లలో కొబ్బరి తోటలు తలలు వాల్చేస్తున్నాయి. లంక గ్రామాల్లో పశుగ్రాసం కొరత మొదలై పశు పోషకులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గత ఏడాది, ఈ ఏడాది జూన్ 1 నుంచి జూలై 25 వరకూ గోదావరిలో నీటి లభ్యత, వినియోగం వివరాలు (టీఎంసీలలో)
గత నెల 17న కొత్తపేట మండలం వాడపాలెం గ్రామస్తులు పెళ్లి చేసిన కప్పలు
వరుణుడి కరుణ కోసం..: అమలాపురం రూరల్ రంగాపురంలో ఈ నెల 22న కప్పలతో ఊరేగింపు
జిల్లాలో జూన్, జూలై నెలల్లో వర్షపాతం లోటు (మిల్లీమీటర్లలో)
మండలం జూన్ జూలై (25 వరకూ)
నమోదైనది సాధారణ లోటు నమోదైనది సాధారణ లోటు
అయినవిల్లి 39.9 103.4 –61.4 30.2 247.7 – 87.8
రామచంద్రపురం 44.1 87.0 –49.3 37.7 224.3 – 83.2
ఆలమూరు 95.5 107.4 –11.1 169.0 225.0 – 24.9
రావులపాలెం 52.6 107.5 –51.1 21.8 227.5 – 90.4
కొత్తపేట 22.4 96.5 –76.8 38.1 223.4 – 82.9
కె.గంగవరం 45.0 102.6 –56.1 54.4 226.9 – 75.8
పి.గన్నవరం 62.8 113.0 –44.4 47.7 215.7 –78.1
ముమ్మిడివరం 51.5 126.0 –59.1 48.1 230.8 –79.1
ఐ.పోలవరం 73.4 114.1 –35.7 37.8 219.9 –82.4
అంబాజీపేట 21.1 122.7 –82.8 27.3 220.2 –87.5
మామిడికుదురు 69.7 121.4 –42.6 21.2 192.7 –89.0
రాజోలు 41.3 126.4 –67.4 27.4 203.4 –86.5
మలికిపురం 97.9 90.9 +7.7 64.8 185.9 –65.1
సఖినేటిపల్లి 100.3 140.3 –28.5 31.6 204.3 –84.3
అల్లవరం 58.3 117.3 –50.3 15.2 210.3 –92.8
అమలాపురం 54.3 118.0 –54.0 82.5 215.1 –61.7
ఉప్పలగుప్తం 60.4 111.1 –40.2 42.2 203.5 –79.3
కాట్రేనికోన 105.9 134.8 –10.5 52.7 218.2 –75.9
జిల్లా సగటు వర్షపాతం
జూన్ 57.9 112.5 48.5 శాతం
జూలై 25 వరకూ 40.6 218.9 81.4 శాతం
ఫ ఎల్‌నినోతో జిల్లాలో
రెండో వేసవి వాతావరణం
ఫ కప్పలకు పెళ్లిళ్లు చేసినా..
కరుణించని వరుణుడు
ఫ జూన్‌లో వర్షపాతం లోటు 48.5 శాతం
ఫ జూలై 81.4 శాతం లోటు
ఫ ఎండిపోతున్న నారుమడులు
ఫ నీటి కోసం రైతన్న ఎదురుచూపులు
ఫ డెల్టాపై ఆందోళన నీడ
గత ఏడాది ఈ ఏడాది
తూర్పు డెల్టా కాలువకు 14.995 17.109
మధ్య డెల్టా కాలువకు 7.901 9.448
పశ్చిమ డెల్టా కాలువకు21.504 26.727
డెల్టా కాలువలకు మొత్తం వినియోగం 44.400 53.284
సముద్రంలోకి విడిచిపెట్టిన జలాలు 430.392 31.867
బ్యారేజీకి వచ్చిన మొత్తం నీరు 472.792 85.151
గత, ఈ ఏడాది జూలై 26న కాలువలకు విడుదల చేసిన నీరు
9,100 (క్యూసెక్కులు) 14,700 (క్యూసెక్కులు)
గత, ఈ ఏడాది జూలై 25న సముద్రంలోకి విడిచిపెట్టిన నీరు
2,16,302 (క్యూసెక్కులు) 14,900 (క్యూసెక్కులు)


