సఖినేటిపల్లి: అంతర్వేది లక్ష్మీ నృసింహస్వామి ఆలయం తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా భక్తులతో రద్దీగా మారింది. వేకువ జాము నుంచి స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులతో క్యూలైన్లు నిండిపోయాయి. ఆలయంలో నిత్యం నిర్వహించే స్వామివారి అభిషేకం, సుదర్శన హోమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ఆలయ ఈవో ఎంకేటీఎన్‌వీ ప్రసాద్ పర్యవేక్షించారు. కాగా ఎండోమెంట్స్ కమిషనర్ ఆదేశాల మేరకు వర్షాభావ పరిస్థితులు, సస్యానుకూల వర్షాలు కురవాలని వరుణ సూక్త పారాయణం చేశారు. ఆలయ ఈవో ప్రసాద్, భక్తులు పాల్గొన్నారు. తొలి ఏకాదశి రద్దీకి తగ్గట్టుగా నిత్యాన్నదాన పథకంలో భక్తుల భోజన వసతికి దేవస్థానం భారీ ఏర్పాట్లు చేసింది.


