● ఆదిత్య ప్రొ వైస్ చాన్సలర్ సతీష్‌రెడ్డి
● అట్టహాసంగా హ్యాండ్‌బాల్ క్రీడలు ప్రారంభం
● దక్షిణాది రాష్ట్రాల నుంచి
250 మంది క్రీడాకారుల హాజరు
పెద్దాపురం: విద్యతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉన్నత శిఖరాలు సాధించవచ్చని ఆదిత్య విద్యా సంస్థల ప్రో వైస్‌చాన్సలర్ నల్లమిల్లి సతీష్‌రెడ్డి తెలిపారు. నవోదయ విద్యాలయ సమితి నేతృత్వంలో హైదరాబాద్ రీజియన్ పరిధిలోని విద్యాలయాల క్రీడాకారులకు స్థానిక పీఎంశ్రీ జవహార్ నవోదయ విద్యాలయంలో బుధవారం హ్యాండ్‌బాల్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు సాగే ఈ పోటీలను సతీష్‌రెడ్డి ప్రారంభించి మాట్లాడుతూ జవహార్ నవోదయ విద్యాలయాలు విద్యతో పాటు ఆటలకు సముచిత స్థానం కల్పిస్తూ ఉన్నతమైన పౌరులను అందిస్తోందన్నారు. సుమారు 250 మంది క్రీడాకారులు ఈ పోటీలకు హాజరయ్యారు. కార్యక్రమంలో పెద్దాపురం నవోదయ విద్యాలయ ప్రిన్సిపాల్ ఎస్‌ఎస్ కీర్తి, మహారాణి కళాశాల ప్రిన్సిపాల్ సత్యనారాయణమూర్తి, ఎన్‌సీసీ ఆఫీసర్ ఎస్.సత్యనారాయణ, వ్యాయామ ఉపాధ్యాయుడు చక్రవర్తి, అనురాథ, సీహెచ్ జనార్దన్ నాయుడు, పి.రామారావు, ప్రేమలత, రాజ్యలక్ష్మి, ఎం.లక్ష్మణరావు, కె. విజయ్‌కుమార్, కె.రామచంద్రు తదితరులు పాల్గొన్నారు.


