నర్సరీలో పని కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

నర్సరీలో పని కల్పించాలి

Jun 7 2026 12:15 AM | Updated on Jun 7 2026 12:15 AM

అవిడి నర్సరీలో వివిధ పనులు చేసుకుంటూ ఉపాధి పొందేవారం. కొంతకాలంగా పని చెప్పడం లేదు. దీంతో దూర ప్రాంతాల్లో వేరే పనులకు వెళ్లాల్సి వస్తుంది. అదే ఈ నర్సరీలో అయితే ఎక్కడికీ వెళ్లక్కర్లేకుండా ఇంటికి సమీపంలోనే వ్యయ ప్రయాసలు లేకుండా పనిచేసుకోవచ్చు.

–ముంగండ సత్యవతి, కూలీ, అవిడి

నిర్వహణకు నిధులు రావాలి

జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన నర్సరీల్లో 4.80 లక్షల మొక్కలు పెంచగా, 3.30 లక్షలు పంపిణీ చేశాం. ఇంకా 1.50 లక్షల మొక్కలు నర్సరీల్లో ఉన్నాయి. ఈ నర్సరీల నిర్వహణకు నిధులు రాక, అటవీ శాఖ సిబ్బందితో వాటరింగ్‌ చేయిస్తున్నాం.

–ఎంవీ ప్రసాద్‌,

డీఎఫ్‌ఓ,

అమలాపురం

అలసత్వమే కారణం

గత ఏడాది సకాలంలో మొక్కలు పంపిణీ చేయక సుమారు 40 శాతం మొక్కలు నిలిచిపోయాయి. అటవీ శాఖ అలసత్వం కారణంగా సకాలంలో నిధులు మంజూరు కాక, స్థానిక కూలీలకు పని కల్పించక, నర్సరీ నిర్వహణ లేక మొక్కలు ఎండిపోతున్నాయి. ఉన్నతాధికారులు స్పందించాలి.

–దూళి సూరిబాబు, ఎంపీటీసీ సభ్యుడు, అవిడి

Advertisement
 
Advertisement
Advertisement