ఆత్రేయపురం/ రామచంద్రపురం రూరల్/ అయినవిల్లి, సఖినేటిపల్లి: జిల్లాలోని పలు ఆలయాలను పట్నా హైకోర్టు జడ్జి ఎ.అభిషేక్‌రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వాడపల్లి వేంకటేశ్వరస్వామి, ద్రాక్షారామ మాణిక్యాంబ సమేత భీమేశ్వరస్వామి, అయినవిల్లిలోని విఘ్నేశ్వరస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ద్రాక్షారామలో భీమేశ్వరస్వామిని, మాణిక్యాంబ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయా ఆలయాల్లో స్వామివారి శేష వస్త్రాలతో ఆయన్ని సత్కరించి, స్వామివారి చిత్రపటాలు, ప్రసాదాన్ని అంద జేశారు. అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయాన్ని పట్నా హైకోర్టు జడ్జి అభిషేక్‌రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించున్నారు. ఆత్రేయపురం మండలం ర్యాలీ జగన్మోహినీ కేశవస్వామి ఆలయాన్ని జడ్జి అభిషేక్‌రెడ్డి దర్శించుకుని, అన్నదాన పథకానికి రూ.10,116 విరాళం సమర్పించారు.


