రైల్వే అధికారులు నిర్లక్ష్యం వల్లనే 4, 5 ప్లాట్‌ఫామ్‌లపై దౌర్భాగ్య పరిస్థితి నెలకొంది. ఇక్కడ కనీస సౌకర్యాలు కల్పించాలని ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేసినా రెండేళ్లుగా ఎటువంటి చర్యలూ చేపట్టలేదు. ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నా కనీస వసతుల కల్పనపై అధికారులు దృష్టి సారించకపోవడం దారుణం. ఇప్పటికై నా ఈ సమస్యలను పరిష్కరించి, ప్రయాణికుల ఇబ్బందులు తొలగించాలి.
– లంకా సత్యనారాయణ, అధ్యక్షుడు,
పీస్ ఫర్ పీపుల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్,
రాజమహేంద్రవరం
ఇబ్బందికరం
రాజమండ్రి రైల్వే స్టేషన్ 4, 5 ప్లాట్‌ఫామ్‌లపై తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. ప్లాట్‌ఫామ్‌ల నిర్మాణ సమయంలోనే షెల్టర్లు కూడా నిర్మించాల్సి ఉన్నా ఇప్పటి వరకూ ఏర్పాటు చేయలేదు. రైలు ఆగే సమయంలో ఏ బోగీ ఎక్కడ ఆగుతుందో తెలియని దుస్థితి నెలకొంది. ఈ ఇబ్బందికర పరిస్థిలో దివ్యాంగులు, వృద్ధులు, మహిళలు రైలు ఎక్కడానికి నానా అగచాట్లూ పడుతున్నారు.
– బండారు శ్రీనివాస్, రాజమహేంద్రవరం


