గడచిన రెండేళ్లలో ప్రజలపై మోయలేని భారం మోపుతున్న చంద్రబాబు ప్రభుత్వం సూపర్ సిక్స్ అమలు చేయడంలో వారిని పూర్తిగా వంచించింది. ఈ రెండేళ్లు చంద్రబాబు సర్కార్ కొనసాగిస్తున్న అసమర్థపాలన, అరాచకవాదం, వెన్నుపోటు రాజకీయాలకు చరమ గీతం పాడాల్సిందే. గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలయ్యే విధంగా వైఎస్సార్ సీపీ రాజీలేని పోరాటం చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఈ ప్రభుత్వాన్ని ప్రజలతో కలిసి గద్దె దింపుతాం.
– చిర్ల జగ్గిరెడ్డి, కొత్తపేట నియోకవర్గ కో ఆర్డినేటర్, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు
ప్రచారం తప్ప అభివృద్ధి లేదు
చంద్రబాబు రెండేళ్ల పాలనలో ప్రచారం పీక్‌లో ఉంది కాని అభివృద్ధి లేదు. ఒకరింట చేపల కూర వండుతున్నారు. మరోచోట కల్లు తాగుతున్నారు. ఇంకొక చోట ముంజులు తింటున్నారు. ఇలా ప్రచారం చేసుకుంటున్నారే తప్ప ఆయా వర్గాలకు సంక్షేమ పథకాలు అందేలా చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు.
– విప్పర్తి వేణుగోపాలరావు, జెడ్పీ చైర్మన్, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా
వెన్నుపోటుకు చిరునామా
చంద్రబాబు
చంద్రబాబు నాయుడు అంటేనే వెన్నుపోటుకు చిరునామా. ఎన్నికల ముందు అమలు చేయలేని వాగ్దానాలు చేసి రెండేళ్ల కాలంలో వాటిని అమలు చేయకుండా ప్రజలను వంచించారు. ఈసారి బాబును నమ్మే స్థితిలో ప్రజలు లేరు.
– కుడుపూడి సూర్యనారాయణరావు, ఎమ్మెల్సీ
అప్పులే చేశారు
రెండేళ్ల చంద్రబాబు పాలనలో సంక్షేమం లేదు. ఏకంగా రూ.3.56 లక్షల కోట్లు అప్పులు చేశారు. అభివృద్ధి పేరుతో చేసిన అప్పుల సొమ్మును చంద్రబాబు నుంచి కార్యకర్తల వరకు జేబులు నింపుకుంటున్నారు. ఏడాదికి నాలుగు లక్షల ఉద్యోగాలని చెప్పారు. మరి ఈ రెండేళ్లలో ఎనిమిది లక్షల ఉద్యోగాలు ఇచ్చారా? అది ఇవ్వలేదు సరికదా.. ఇస్తానన్న నిరుద్యోగ భృతి కూడా అందించలేదు.
– బొమ్మి ఇజ్రాయిల్, ఎమ్మెల్సీ
●


