అవినీతి అక్రమాలకు రెండేళ్లు | - | Sakshi
Sakshi News home page

అవినీతి అక్రమాలకు రెండేళ్లు

Jun 4 2026 5:04 AM | Updated on Jun 4 2026 5:04 AM

రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు

మరోసారి వెన్నుపోటు

వైఎస్సార్‌ సీపీ యువజన విభాగం

జిల్లా అధ్యక్షుడు సూర్యప్రకాశ్‌

రామచ్రందపురం: రాష్ట్రంలో అవినీతి అక్రమాలతో రెండేళ్ల పాటు వెన్నుపోటు పాలనను చంద్రబాబు నాయుడు సాగించారని, వైఎస్సార్‌ సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు, రామచంద్రపురం నియోజకవర్గ సమన్వయకర్త పిల్లి సూర్యప్రకాశ్‌ విమర్శించారు. పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ కార్యక్రమానికి సంబంధించి పట్టణంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం పోస్టర్‌ను విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ అధికారం చేపట్టి రెండేళ్లు గడుస్తున్నా అరకొరగా సూపర్‌ సిక్స్‌ను అమలు చేసి, అన్ని చేసేశాం అని గొప్పలు చెప్పుకుంటూ చంద్రబాబు ఈ రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. ఆడబిడ్డ నిధి పేరుతో 18 నుంచి 50 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు రూ.1,500లు వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని హామీ ఇచ్చారని ఇప్పటికీ అమలు చేయకుండా రాష్ట్రంలోని మహిళలను మోసం చేస్తున్నారన్నారు. నిరుద్యోగ భృతి కింద ప్రతి నెలా రూ.3వేల చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారని, ఈ రెండేళ్లలో రాష్ట్రంలోని యువతకు రూ. 72 వేల కోట్లు ఇవ్వాల్సి ఉండగా ఒక్క రూపాయి కూడా అందించలేదన్నారు. మెగా డీఎస్సీలో అక్రమాలు, అవినీతికి పాల్పడి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆ శాఖ మంత్రి లోకేష్‌ దగా డీఎస్పీగా మార్చేశారన్నారు. డీఎస్పీలో అవినీతిపై ఆధారాలతో సహా తమ పార్టీ బయటపెట్టినా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని విమర్శించారు. బీసీ, ఎస్సీ మహిళలకు 50 ఏళ్లకే పెన్షన్‌ ఇస్తామని చెప్పి వెన్నుపోటు పొడిచారన్నారు. తల్లికి వందనం పథకం మొదటి సంవత్సరం ఎగ్గొటి, అరకొరగా అమలు చేస్తున్నారన్నారు. ఉచితంగా 3 గ్యాస్‌ సిలిండర్‌లు ఇస్తామని చెప్పి ఒక సిలిండర్‌ ఇచ్చి చేతులు దులుపుకొన్నారని విమర్శించారు. అన్నదాత సుఖీభవ పేరుతో రైతులను కూడా నిలువునా ముంచేశారని సూర్యప్రకాశ్‌ అన్నారు. రైతులు ధాన్యాన్ని అమ్ముకోలేక నానా అవస్థలు పడినా ఈ జిల్లా మంత్రి పట్టించుకోలేదని విమర్శించారు. అన్ని వర్గాల వారికి చంద్రబాబు ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిన విషయం ప్రజల్లో ఎండగట్టేందుకు నేటి నుంచి జిల్లాలో నిరసన కార్యక్రమాలను చేపడుతున్నట్లు వెల్లడించారు. మండల కేంద్రాల్లో పార్టీ కన్వీనర్‌ల ఆధ్వర్యంలో గురువారం నిరసన చేపడుతున్నట్లు చెప్పారు. యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు మాదిరాజు ఫృథ్వీరాగ్‌, జిల్లా అధికార ప్రతినిధి పెమ్మిరెడ్డి మురళి, మాజీ ఎంపీపీ అంబటి భవానీ, మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ కోలమూరి శివాజీ, మాజీ కౌన్సిలర్‌ గుబ్బల గణ, పోతంశెట్టి గోపాలకృష్ణ, ఎండీ మస్తాన్‌, నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలు సతీష్‌కుమారి, జిల్లా బీసీ సెల్‌ కార్యదర్శి గుత్తుల శ్రీను(డ్రీమ్‌), పార్టీ కన్వీనర్‌లు గాధంశెట్టి శ్రీధర్‌, పోలినాటి వరప్రసాద్‌, పట్టణ మహిళా విభాగం అధ్యక్షురాలు మల్లిడి సాయిలక్ష్మి, పార్టీ నేతలు గుంట ముక్కల దొరబాబు, బొమ్ము మోహనరావు, కొసనా కామేశ్వరరావు, బండి త్రిమూర్తులు, సత్తిశంకర్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌ చిల్లే నాగేశ్వరరావు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement