ఐ.పోలవరం: మండల తహసీల్దార్ కార్యాలయం బుధవారం ఉదయం 10.30 గంటలైనా తెరుచుకోలేదు. దీంతో వివిధ పనుల మీద వచ్చిన జనం అధికారులు, సిబ్బంది కోసం మండుటెండలో ఎదురుతెన్నులు చూశారు. కనీసం సమాధానం చెప్పే నాథుడే కరువయ్యాడు. 10.30 గంటలు దాటిన తరువాత ఒక వీఆర్వో వచ్చి తలుపులు తీశారు. వచ్చినవారు ‘‘అమ్మా సిబ్బంది ఏరి’’ అని అడగగా మాకు తెలియదు అని చెప్పారు. తరువాత ఎప్పుటికో గాని అధికారులు, సిబ్బంది పూర్తి స్థాయిలో రాలేదు. అప్పటి వరకు కార్యాలయంలో కుర్చీలు ఖాళీగా దర్శనమిస్తూనే ఉన్నాయి. తహసీల్దార్ కార్యాలయం ఇలా తాపీగా తెరచుకోవడం పరిపాటిగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.


