హామీలను విస్మరించి.. ప్రజలను మోసగించి.. | - | Sakshi
Sakshi News home page

హామీలను విస్మరించి.. ప్రజలను మోసగించి..

Jun 3 2026 12:27 AM | Updated on Jun 3 2026 12:27 AM

ఎన్నికలను హామీలను పట్టించుకోని

చంద్రబాబు

అన్ని వర్గాల ప్రజల అవస్థలు

వెఎస్సార్‌ సీపీ నాయకుల ధ్వజం

చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు పోస్టర్‌ ఆవిష్కరణ

4న నియోజకవర్గాల్లో నిరసనలు

అమలాపురం రూరల్‌: ఎన్నికల ముందు సూపర్‌ సిక్స్‌తో సహా 143 హామీలు ఇచ్చి, సంపద సృష్టించి అమలు చేస్తామన్న చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, లోకేష్‌.. అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరించి, ప్రజలను నట్టేట ముంచారని ఎమ్మెల్సీలు బొమ్మి ఇజ్రాయిల్‌, కుడుపూడి సూర్యనారాయణరావు, వైఎస్సార్‌ సీపీ ముమ్మిడివరం, రాజోలు, పి.గన్నవరం నియోజకవర్గాల కో ఆర్డినేటర్లు పొన్నాడ సతీష్‌కుమార్‌, పాములు రాజేశ్వరీదేవి, గన్నవరపు శ్రీనివాసరావు అన్నారు. అమలాపురం మండలం భట్నవిల్లిలోని మాజీ మంత్రి పినిపే విశ్వరూప్‌ నివాసం వద్ద చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమం పోస్టర్‌ను మంగళవారం ఆవిష్కరించారు. వైఎస్సార్‌ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో పార్టీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి పిలుపు మేరకు ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి నిరసనగా జూన్‌ 4న జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రజలతో కలిసి భారీ ర్యాలీలు చేపట్టి అధికారులకు వినతిపత్రాలు అందజేస్తామన్నారు. వెన్నుపోటుకు చిరునామాగా చంద్రబాబు మారారన్నారు. ఆచరణ సాధ్యం కాని హామీలతో ఎన్నికల సమయంలో ప్రజలందరినీ వెన్నుపోటు పొడిచారన్నారు. కూటమి సర్కారు అధికారంలో చేపట్టి జూన్‌ 4కు రెండేళ్లు అవుతున్న సందర్భంగా, వారి నిరంకుశ పాలనపై నిరసన తెలుపుతామన్నారు. కార్యక్రమంలో సీఈసీ సభ్యులు పేరి కామేశ్వరరావు, కేఎస్‌ఎన్‌ రాజు, కుడుపూడి భరత్‌ భూషణం, సాక మణి కుమారి, బాలముని కుమారి, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు చెల్లుబోయిన శ్రీనివాసరావు, కర్రి నాగిరెడ్డి, వంటెద్దు వెంకన్నాయుడు, కటకంశెట్టి ఆదిత్య కుమార్‌, నియోజవర్గాల పరిశీలకలు చింతలపాటి శ్రీనివాస్‌ రాజు, రాష్ట్ర యువజన విభాగ కార్యదర్శి పాములు ప్రకాష్‌, రాష్ట్ర వాణిజ్య విభాగ కార్యదర్శి కంచర్ల శేఖర్‌, రాష్ట్ర బీసీ సెల్‌ కార్యదర్శి గుబ్బల మనోహర్‌, అమలాపురం టౌన్‌ అధ్యక్షుడు సంసాని చంద్రశేఖర్‌ (నాని), అంబాజీపూట మండల అధ్యక్షుడు విత్తనాలు ఇంద్రశేఖర్‌, సఖినేటిపల్లి మండల అధ్యక్షుడు కుసుమ చంద్రశేఖర్‌, పి.గన్నవరం నియోజవర్గ బూత్‌ కన్వీనర్ల అధ్యక్షుడు గన్నవరపు సాయి ప్రసాద్‌, తిరుకోటి సతీష్‌కుమార్‌, విత్తానాలమూర్తి ,ఈతకోట శ్రావణ్‌, చెల్లుబోయిన నాని తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement