సాక్షి, అమలాపురం/ అమలాపురం రూరల్: ‘ఇది మెగా డీఎస్సీ కాదు, ముమ్మాటికి దగా డీఎస్సీ. అర్హులను అనర్హులను చేశారు, అనర్హులను అందలమెక్కించారు. యువతను వంచించారు, నిరుద్యోగులను మోసం చేశారు. డీఎస్సీలో అక్రమాలకు నైతిక బాధ్యత వహించి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణం రాజీనామా చేయాలి’ అని వైఎస్సార్ సీపీ శ్రేణులు నినదించాయి. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఉపాధ్యాయుల ఖాళీల భర్తీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన డీఎస్సీలో అక్రమాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. దీనిపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా కేంద్రమైన అమలాపురంలో యువజన విభాగం ఆధ్వర్యంలో సోమవారం నిరసన, ధర్నా నిర్వహించారు. పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు, రామచంద్రపురం కో ఆర్డినేటర్ పిల్లి సూర్యప్రకాశ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా ఆరు నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులు, యువజన, విద్యార్థి విభాగాల నాయకులు, వాటి ప్రతినిధులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. డీఎస్సీలో అక్రమాలపై సీబీఐ విచారణ చేపట్టాలని, లేదంటే హైకోర్టు జడ్జితోనైనా విచారణ చేయాలని డిమాండ్ చేశారు.
కలెక్టరేట్‌కు
పాదయాత్రగా..
తొలుత స్థానిక నల్ల వంతెన వద్ద నిరసన శిబిరం నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి పాదయాత్రగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. కలెక్టరేట్ గేటు ముందు బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీ పరీక్షల్లో అర్హుల ఎంపిక ప్రక్రియలో చోటుచేసుకున్న అవకతవకలు, అక్రమాలు నిరుద్యోగ యువతను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయని ఆరోపించారు. అర్హత, ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలు కల్పించాల్సిన ప్రభుత్వం, నియామక ప్రక్రియను వివాదాస్పదం చేసి వేలాది మంది భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసిందన్నారు. ఎమ్మెల్సీలు కుడుపూడి సూర్యనారాయణరావు, బొమ్మి ఇజ్రాయిల్, రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జిన్నూరి రామారావు (బాబీ), పి.గన్నవరం, రాజోలు నియోజకవర్గాల కోఆర్డినేటర్లు గన్నవరపు శ్రీనివాసరావు, పాముల రాజేశ్వరీదేవి, వైఎస్సార్ సీపీ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ చింతా అనురాధ, పార్టీ నియోజకవర్గ పరిశీలకులు చెల్లుబోయిన శ్రీనివాసరావు, కటకంశెట్టి నాగ ఆదిత్య కుమార్, చింతలపాటి శ్రీనివాసరాజు, వంటెద్దు వెంకన్నాయుడు, పార్టీ ఎస్‌ఈసీ సభ్యుడు కుడుపూడి భరత్ భూషణ్, అనుబంధ విభాగాల జిల్లా అధ్యక్షులు మిండగుదిటి శిరీష్, చీకట్ల కిషోర్, తోరం గౌతమ్, జిన్నూరి వెంకటేశ్వరరావు, దొమ్మేటి సత్య మోహన్, వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రుద్రరాజు చిన రాజా, యువ జన విభాగం రాష్ట్ర కార్యదర్శి సలాది సతీష్, పార్టీ నాయకులు సంసాని నాని, విత్తనాల మూర్తి, అమర్ కుమా ర్ పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ పోరుబాట
నిరుద్యోగులకు అండగా పార్టీ శ్రేణులు
మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి
అక్రమాలపై విచారణ చేపట్టాలని డిమాండ్
నల్లవంతెన నుంచి
కలెక్టరేట్ వరకు ర్యాలీ
భారీగా తరలివచ్చిన నిరుద్యోగులు,
పార్టీ నాయకులు, కార్యకర్తలు


