డీఎస్సీ అక్రమాలపై నిరుద్యోగ యువత ఉవ్వెత్తున ఉద్యమించాలి. చంద్రబాబు ప్రభుత్వం నిరుద్యోగ యువతను మోసం చేసింది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అయిన తర్వాతే నిరుద్యోగ యువతకు, బడుగు బలహీన వర్గాలకు మేలు జరుగుతుంది. కూటమి ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు.
– కుడుపూడి సూర్యనారాయణరావు, ఎమ్మెల్సీ
ఉద్యోగాలను అమ్ముకున్నారు
డీఎస్సీ అక్రమాల నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణం రాజీనామా చేయాలి. డీఎస్సీ అవినీతిపై సీబీఐ, హైకోర్టు సింగిల్ జడ్జితో విచారణ చేపట్టాలి. ఉద్యోగాలను మెరిట్ లిస్టులో అభ్యర్థులకు ఇవ్వకుండా కూటమి నాయకుల బంధువులకు అమ్ముకున్నారు. స్పోర్ట్స్ కోటాలో అర్హత లేనివారికి ఉద్యోగాలు ఇచ్చారు.
– బొమ్మి ఇజ్రాయిల్, ఎమ్మెల్సీ
అక్రమాలపై విచారణ చేయాలి
మెగా డీఎస్సీ అక్రమాలపై విచారణ చేయాలి. అక్రమాలు జరిగాయని వైఎస్సార్ సీపీ మాత్రమే చెప్పడం లేదు. దగా పడిన నిరుద్యోగ యువత హైకోర్టు తలుపుతట్టారు. కాబట్టి ప్రభుత్వం దీనిపై విచారణ చేపట్టాల్సి ఉంది. రెండేళ్లలో కేవలం 16 వేల ఉపాధ్యాయ పోస్టులు మాత్రమే భర్తీ చేశారు. మాజీ సీఎం జగన్ హయాంలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసినా ఒక్కరు కూడా అక్రమం జరిగిందని రోడ్డు ఎక్కలేదు.
– పిల్లి సూర్య ప్రకాష్, వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు, రామచంద్రపురం కోఆర్డినేటర్
యువతకు అన్యాయం
డీఎస్సీ మెరిట్ లిస్టును ప్రభుత్వం ప్రకటించకుండా అక్రమాలకు పాల్పడింది. నిరుద్యోగ యువతకు మంత్రి లోకేష్ అన్యాయం చేశారు. డబ్బులిచ్చిన అభ్యర్థులకే ఉద్యోగాలకు ఎంపికై నట్టు సమాచారం పంపించారు. మెగా డీఎస్సీపై ప్రతిపక్షాలు మాట్లాడితే కేసులు పెడతామని సీఎం చంద్రబాబు భయపెడుతున్నారు. నిరుద్యోగ యువత ఉసురు ఈ ప్రభుత్వానికి తగులుతుంది.
– పాముల రాజేశ్వరీదేవి, మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాజోలు కోఆర్డినేటర్
సమాధానం చెప్పాలి
మెగా డీఎస్సీ పేరుతో చంద్రబాబు ప్రభుత్వం నిరుద్యోగ యువతను మోసం చేసింది. ఉద్యోగాలు వస్తాయని ఎంతో కష్టపడి చదివిన యువతకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ద్రోహం చేశారు. డీఎస్సీ అవినీతిపై వస్తున్న ఆరోపణలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి. జగన్‌పై అసత్య ప్రచారం ఆపి, మీ నిజాయితీని నిరూపించుకోవాలి. అక్రమాలు జరగకపోతే ప్రభుత్వం చర్చకు సిద్ధం కావాలి.
– గన్నవరపు శ్రీనివాసరావు, వైఎస్సార్ సీపీ పి.గన్నవరం కో ఆర్డినేటర్
నిరుద్యోగులకు అండగా వైఎస్సార్ సీపీ
డీఎస్సీలో దగా పడిన నిరుద్యోగ యువతకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుంది. డీఎస్సీ అవినీతిపై ప్రభుత్వం విచారణకు ఎందుకు ఆదేశించడం లేదో నిరుద్యోగ యువత ఆలోచించాలి. వైఎస్సార్ సీపీ చేపట్టిన దగా డీఎస్పీకి మద్దతుగా నిరుద్యోగ యువత రాష్ట్ర స్థాయిలో ఉద్యమం చేయాలి.
– చింతా అనూరాధ, వైఎస్సార్ సీపీ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ
వివరణ ఇవ్వరేం!
ఇది మెగా డీఎస్సీనా లేక అభ్యర్థులను మోసం చేసిన దగా డీఎస్సీనా?, అసలు రాష్ట్రంలో ఎక్కడ ఏది జరిగినా అది నా విజనరీ వల్లే అని చెప్పే సీఎం చంద్రబాబు నాయుడు.. ఇవాళ డీఎస్సీ అక్రమాలపై నోరెందుకు మెదపడం లేదు. బాధితులు రోడ్లు ఎక్కి నిరసన తెలుపుతుంటే ఆయన గానీ, విద్యాశాఖ మంత్రి లోకేష్ గానీ ఎందుకు స్పందించి వివరణ ఇవ్వడం లేదు.
– మిండగుదిటి శిరీష్, వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు
●


