వైఎస్సార్ సీపీ పశ్చిమ గోదావరి
జిల్లా అధ్యక్షుడు ముదునూరి
మలికిపురం: రాష్ట్రంలో అధికారంలోనికి వచ్చిన రెండేళ్లకే కూటమి ప్రభుత్వం ప్రజలలో పూర్తి స్థాయిలో విశ్వాసం కోల్పోయిందని వైఎస్సార్ సీపీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు అన్నారు. ఆదివారం ఆయన మలికిపురంలోని పార్టీ సీఈసీ సభ్యులు కేఎస్‌ఎన్ రాజు నివాసంలో పార్టీ నాయకులను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ నాయకులను వేధించడం, బెదిరించడం, అక్రమ కేసులు పెట్టడంతోనే కూటమి నేతల సమయం సరిపోతుందని, ఇక ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసే సమయం ఎక్కడ ఉంటుందన్నారు. జగన్ పాలనను, కూటమి పాలనను ప్రజలు బేరీజు వేసుకుంటున్నారని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఎప్పుడు, ఏ ఎన్నికలు వచ్చినా వైఎస్సార్ సీపీని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే, రాజోలు కో ఆర్డినేటరు పామలు రాజేశ్వరీ దేవి, సీఈసీ సభ్యులు కెఎస్‌ఎన్ రాజు తదితరులు ప్రసాదరాజును సన్మానించారు. పార్టీ నాయకులు కంచర్ల శేఖర్, పాముల ప్రకాష్, గుబ్బల మనోహర్, కసుమ చంద్రశేఖర్, చింతా ప్రసాద్, బల్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు.


