ధాన్యం కొనుగోలు చేయాలి | - | Sakshi
Sakshi News home page

ధాన్యం కొనుగోలు చేయాలి

Jun 1 2026 12:02 AM | Updated on Jun 1 2026 12:02 AM

జిల్లా రైతుల వద్ద 20 వేల

మెట్రిక్‌ టన్నులు

జేసీకి వైఎస్సార్‌ సీపీ రైతు విభాగం వినతి

అమలాపురం రూరల్‌: పండించిన ధాన్యాన్ని విక్రయించేందుకు జిల్లా రైతులు ఆయా రైతు భరోసా కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. రాజోలు మండల పరిధిలో 203 మంది రైతులు ధాన్యాన్ని విక్రయించేందుకు రైతు సేవా కేంద్రాలను సంప్రదించగా లక్ష్యం పూర్తయ్యింది.. తాము తీసుకోలేమంటున్నారని, మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడు జిన్నూరి రామారావు (బాబి) అధ్వర్యంలో జేసీ వైఖోమ్‌ నిడియాదేవిని కలసి వినతిపత్రం సమర్పించారు. జిల్లాలోని తొమ్మిది మండలాల్లో ఇంకా పూర్తిస్థాయిలో ధాన్య సేకరణ జరగలేదని అన్నారు. వర్షం వస్తేఽ ధాన్యం తడిసి రైతులు నష్టపోతారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాజోలు మండలంలో 1500 మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఇంకా పంట చేలోనే ఉందని, ఇలా జిల్లాలో ఉన్న 20 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని జేసీని వారు కోరారు. జిన్నూరితో పాటు పార్టీ రైతు విభాగం రాష్ట్ర నాయకులు గుబ్బల రమేష్‌, పాముల ప్రకాష్‌, జవహర్‌లాల్‌, చెల్లుబోయిన సత్యనారాయణ, గుబ్బల సత్యనారాయణ, పాల్గొన్నారు.

వాడపల్లి వెంగన్నకు

బస్సు సమర్పణ

రూ.32 లక్షల విలువైన వాహనాన్ని

అందించిన కెనరా బ్యాంకు

ఆత్రేయపురం: మండలం వాడపల్లి వేంకటేశ్వర స్వామి వారి ఆలయానికి రావులపాలెంలోని కెనరా బ్యాంక్‌ రూ.32 లక్షల విలువైన బస్సును బహూకరించారు. అలాగే ఆలయ నిత్యాన్నదాన పథకానికి అయినవిల్లి మండలం చింతనలంక వాస్తవ్యులు విల్లా మణికంఠ, జ్యోతి దంపతులు కుటుంబ సభ్యులు రూ.50,120 సమర్పించారు. వీరికి ఆలయ అర్చకులు ఆశీస్సులు, తీర్థ ప్రసాదాలు అందజేశారు. అలాగే ఆలయ ఈవో నల్లం సూర్య చక్రధరరావు స్వామి వారి ఫోటో అందజేశారు.

జయము జయము గణేశా

అయినవిల్లి: స్థానిక విఘ్నేశ్వరస్వామివారిని ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించి, మొక్కుబడులు చెల్లించారు. ఆలయ ప్రధానార్చకుడు అయినవిల్లి సూర్యనారాయణమూర్తి (సురేష్‌) ఆధ్వర్యంలో స్వామికి తెల్లవారు జామున మేలుకొలుపు సేవ, పంచామృతాభిషేకం, ఏకాదశ, లఘున్యాస పూర్వక అభిషేకాలు, లక్ష్మీగణపతి హోమం, గరిక పూజ నిర్వహించారు. అర్చకులు స్వామి వారిని వివిధ పుష్పాలతో అలంకరించి అనంతరం మహా నివేదన చేశారు. సాయంత్రం ఎనిమిది గంటలకు స్వామికి విశేష సేవలు చేసి ఆలయ తలుపులు వేశారు. స్వామికి ఒక జంట పంచామృతాభిషకం నిర్వహించారు.

జాతీయ పురస్కారాలకు

దరఖాస్తుల ఆహ్వానం

అమలాపురం రూరల్‌: వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన ఐదు నుంచి 18 ఏళ్లలోపు బాలల నుంచి జాతీయ పురస్కారాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ఐసీడీఎస్‌ పీడీ నాగమణి తెలిపారు. సామాజిక సేవ, సాంకేతిక పరిజ్ఞానం, పర్యావరణం, ధైర్య సాహసాలు, క్రీడలు, కళలు, సాంస్కృతి రంగాల్లో రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ సాధించిన బాలలు జూలై 31వ తేదీలోపు httpr://awardr.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవలన్నారు. కేంద్ర కమిటీ ద్వారా ఎంపికై న బాలలకు రాష్ట్రపతి చేతులు మీదుగా బహుమతితో పాటు జ్ఞాపిక, ప్రశంసా పత్రాన్ని అందజేస్తారని తెలిపారు.

ఈదరపల్లి–ముక్కామల రహదారి బంద్‌

అమలాపురం రూరల్‌: అమలాపురం మండలం ఈదరపల్లి నుంచి ముక్కామల వెళ్లే కాలువ గట్టు రహదారిని తాత్కాలికంగా మూసివేశారు. నేషనల్‌ హైవే అథారిటీ అధికారులు నేదునూరు – పెదపాలెం ప్రాంతంలో రహదారి మరమ్మతులు చేస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. రావులపాలెం వైపు ప్రయాణించే వాహన చోదకులు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవా లని అధికారులు సూచించారు. భారీ వాహనాలు జనుపెల్లి, నేదునూరు మీదుగా, బండారులంక అంబాజీపేటమీదుగా ముక్కామల వెళ్లాలన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement