● సార్వత్రిక ఎన్నికల సమయంలో 2024 జనవరి 10న కాకినాడ జిల్లా తుని మండలం చామవరం గ్రామంలో చంద్రబాబు పర్యటించారు. ఆ సందర్భంగా అప్పటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వంపై లేనిపోని నిందలు మోపారు. మద్యాన్ని ఏరులై పారిస్తున్నారని, రూ.50 బాటిల్‌ను రూ.200కు అమ్ముతున్నారని ఆరోపించారు. కానీ, ఆయన గద్దెనెక్కిన రెండేళ్లుగా బీరు, బ్రాందీ, విస్కీ ఇలా ఏ బ్రాండ్ మద్యమైనా ప్రతి బాటిల్‌పై మద్యం మాఫియా రూ.10 నుంచి రూ.20 వరకూ అదనంగా దోచుకుంటున్నా కనీస స్పందన కూడా లేదు.
● నిరుద్యోగులకు ఉద్యోగాలిస్తామని, అప్పటి వరకూ ప్రతి నెలా రూ.3 వేల భృతి చెల్లిస్తామని ఉమ్మడి జిల్లాలో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో చంద్రబాబు పదేపదే హామీ ఇచ్చారు. కానీ, ఆయన గద్దెనెక్కిన తరువాత ఆ హామీ కాస్తా గాల్లో కలసిపోయిందని నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటు ఉద్యోగాలు, అటు భృతి ఎంతమందికి ఇచ్చారో చెప్పాలని నిలదీస్తున్నారు. తాజా పర్యటన సందర్భంగా గత హామీలపై చంద్రబాబు ఏం చెప్తారో.. కొత్తగా ఏ మాటల గారడీతో మభ్యపెడతారోనని అంటున్నారు.
గతంలో ఇచ్చిన హామీలేమయ్యాయని
జనం అడుగుతున్నారు సార్!


