వాడపల్లికి పోటెత్తిన భక్తులు | - | Sakshi
Sakshi News home page

వాడపల్లికి పోటెత్తిన భక్తులు

May 31 2026 12:24 AM | Updated on May 31 2026 12:24 AM

ఆత్రేయపురం: కోనసీమ తిరుపతిగా పేరు గాంచిన వాడపల్లి వేంకటేశ్వరస్వామిని శనివారం సుమారు 80 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో తెల్లవారుజామునే ఆలయం వద్ద రద్దీ ఏర్పడింది. వారందరూ గౌతమీ గోదావరిలో స్నానాలు ఆచరించి, క్యూలో నిలబడి స్వామిని దర్శించారు. ఆలయ ఆవరణలో క్షేత్రపాలకుడు అన్నపూర్ణ సమేత విశ్వేశ్వరస్వామికి పూజలు నిర్వహించారు. వేసవి తీవ్రత నేపథ్యంలో భక్తులకు చల్లని మజ్జిగ, నీరు అందించడానికి చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆలయ ఈవో, దేవదాయశాఖ ఉప కమిషనర్‌ నల్లం సూర్యచక్రధరరావు, ఆలయ చైర్మన్‌ ముదునూరి వెంకటరాజు, కమిటీ సభ్యులు, ఆలయ సిబ్బంది ఏర్పాట్లనుపర్యవేక్షించారు.

Advertisement
 
Advertisement
Advertisement